
రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని బాలుడు
సికింద్రాబాద్: గుర్తు తెలియని ఆరేళ్ల బాలుడు రైల్వేస్టేషన్‌లో తిరుగుతుండగా జీఆర్‌పీ పోలీసులు నగరంలోని శిశువిహార్‌కు తరలించారు. మంగళవారం ఓ బాలుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అతడి నుంచి వివరాలు తెలుసుకొనేందుకు యత్నించారు. తన పేరు బాలు అని చెప్పడం మినహా ఆ బాలుడు మిగతా వివరాలు చెప్పలేకపోయాడు. దీంతో అతడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించగా వారు శిశువిహారకు తరలించి ఆశ్రయం కల్పించారు. తల్లిదండ్రులే కావాలని బాలుడ్ని వదిలి వెళ్లారా? లేక తప్పిపోయి వచ్చాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.