సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడి యెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అక్టోబర్ 28లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఫీజుచెల్లింపు అవకాశాన్ని సోమవారం నుంచి ప్రారంభిం చి నట్లు పేర్కొన్నారు.
జనరల్, ఒకేషనల్, హాజరు మినహాయింపుతో (కాలేజీ స్టడీ లేకుండా) పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులు, గ్రూపు మార్పు చేసుకున్న వారంతా నిర్ణీత తేదీల్లో ఫీజులను చెల్లించాలని సూచించారు. రూ. 100 ఆలస్య రుసుముతో కూడా అక్టోబర్ 29 నుంచి నవంబర్ 14 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మరోవైపు మార్చిలో జరిగే పదో తరగతి అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లింపును వచ్చేనెల రెండో వారం లేదా మూడో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
అక్టోబర్ 28 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
Published Tue, Sep 27 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement