
'మా ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ 500 రోజుల టీఆర్ఎస్ పాలనపై 50 ప్రశ్నల బుక్లెట్ను వారు విడుదల చేశారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ... ఎన్నికల హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. తాము విడుదల చేసిన బుక్లెట్లోని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ మంత్రులను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అలాగే బహిరంగ చర్చకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.