ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిషన్ భగీరథను ప్రారంభించవద్దని ఆయన ఈ సందర్భంగా తన లేఖలో కోరారు. ప్రధాని తెలంగాణ పర్యటనను కేసీఆర్ తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి-హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్ట్ను మిషన్ భగీరథగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.3,350 కోట్లతో ఆ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని, నిధులు కేటాయిస్తున్నట్లు తన పర్యటనలో ప్రకటించాలని ఉత్తమ్ తన లేఖలో డిమాండ్ చేశారు.