టీడీపీతో పొత్తుపై రంగంలోకి దిగిన వెంకయ్య | Venkaiah Naidu discussion with Chandrababu Naidu due to TDP-BJP alliance | Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తుపై రంగంలోకి దిగిన వెంకయ్య

Published Fri, Apr 18 2014 11:22 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

టీడీపీతో పొత్తుపై రంగంలోకి దిగిన వెంకయ్య - Sakshi

టీడీపీతో పొత్తుపై రంగంలోకి దిగిన వెంకయ్య

టీడీపీతో పొత్తు వ్యవహరం బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం నడుంబిగించింది. అందులోభాగంగా సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడిని రంగంలోకి దింపింది. అలాగే సీమాంధ్ర ప్రాంతం బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబుతోపాటు వీర్రాజులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారితో వెంకయ్యనాయుడు చర్చించి.. మరికాసేపట్లో టీడీపీ పొత్తుపై బీజేపీ ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

అయితే బీజేపీ, టీడీపీల పొత్తుపై ఆ రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చి. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో సీట్లు సర్దుబాటు కూడా చేసుకున్నాయి. అయితే బీజేపీ... ఎన్నికల బరిలో నిలిపిన అభ్యర్థుల విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం చంద్రబాబుపై చాలా గుర్రుగా ఉంది. అందులోభాగంగా బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావదేకర్ గురువారం హైదరాబాద్ చేరుకుని... చంద్రబాబు వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement