మచ్చల్లో చంద్రుడు | BJP files Charge sheet on Chandrababu Naidu's rule in People' court | Sakshi
Sakshi News home page

మచ్చల్లో చంద్రుడు

Published Tue, Apr 8 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

మచ్చల్లో చంద్రుడు - Sakshi

మచ్చల్లో చంద్రుడు

‘కమలం’ చెప్పిన 100 నిజాలు
 మేడికొండ కోటిరెడ్డి: నాడు ‘చంద్రుడి’లో అవినీతి మచ్చలు చూపింది కమలం. అప్పుడు కత్తులు దూసిన కమలంతో నారా చంద్రబాబునాయుుడు మళ్లీ ఎన్నికల పయనం ప్రారంభించారు. 1995-98 మధ్య చంద్రబాబు పాలనపై నూరు తప్పుల చార్జిషీటును 1998లో బీజేపీ ప్రజాకోర్టులో దాఖలు చేసింది. అప్పుడు నిప్పులు చెరిగిన బీజేపీతో నేడు టీడీపీ పొత్తులతో హత్తుకుంది. ఎన్నికలలో గెలిపిస్తే అది చేస్తా.. ఇది చేస్తానని ఆల్ ఫ్రీ వాగ్దానాలను చంద్రబాబు చేసుకుపోతుంటే.. ఆయన మిత్రపక్షం బీజేపీ మాత్రం చంద్రబాబు చరిత్రంతా ఎన్నికల ముందు ఒకమాట, ఆ తర్వాత మరోమాటంటూ ఘాటుగా స్పందించింది.
 
  ఎన్నికల్లో చెప్పింది చేసే నైజం చంద్రబాబుకు లేనేలేదని తేల్చింది. ఇదే ఆయున బండారవుంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ఏకంగా ఆ పుస్తకంలో దుమ్మెత్తిపోసింది. నూరు తప్పులను సాక్ష్యాధారాలతో ప్రస్తావిస్తూ.. చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ తిరుగుబాటు తెలుగుదేశవుని వుుద్దు పేరు కూడా పెట్టింది. టీడీపీ వంచన, వైఫల్యాలపై ప్రజాకోర్టులో చార్జిషీటు వేసిన బీజేపీతోనే చంద్రబాబు పార్టీ ఉనికి కాపాడుకోవడానికి పొత్తు పెట్టుకుని ఎన్ని‘కల’లకు సిద్ధవుయ్యూరు. చంద్రబాబుపై నాటి బీజేపీ చార్జిషీటులోని వుుఖ్యాంశాలు ఇవీ...
 
 ఒప్పందాలన్నీ స్కాముల పుట్ట
 కాంగ్రెస్ అధికారంలో ఉండగా జరిగిన విద్యుత్ ఒప్పందాలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అవే కంపెనీలతో రూ.2384 కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకున్నారు. ఎన్ని వందల కోట్లు చేతులు వూరాయో..! తుపాను బాధితుల కోసం ప్రజల నుంచి సేకరించిన బియ్యూన్ని కూడా దిగిమింగారన్న ఆరోపణలపై విచారణకు చంద్రబాబు సిద్ధం కాలేకపోయూరు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోరుునా స్కాంలకు కొదవు లేదని అవులాపురంలో పక్కా గృహాల కుంభకోణమే సాక్ష్యం. వూదాపూర్‌లో ఇన్ఫాసిటీ నిర్మాణానికి చదరపు అడుగు రూ.2200 ధరకు టెక్నోయూడ్స్ సంస్థ వుుందుకు వచ్చినా ఎల్‌అండ్‌టీకి రూ.2700లకు ఇచ్చేశారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు కాజేశారు. వరద వురవ్ముతు పనులు, జన్మభూమి పనులు టెండర్లు లేకుండా అధికారపార్టీ వారే హస్తగతం చేసుకోవడం హైటెక్ విధానంలో భాగమే.
 
 రైతాంగం అంటే ఇంత చిన్నచూపా...!
 చంద్రబాబు హయాంలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసినంతగా గతంలో ఎప్పుడూ జరగలేదు. డీజిల్ ధర రెండుసార్లు పెరిగింది. కరెంటు చార్జీలు రెండుసార్లు పెంచారు. లైను చార్జీలు పెంచారు. డిపాజిట్ల భారం మోపారు. ట్రాన్స్‌ఫార్మర్లను రైతులనే సొంతంగా ఏర్పాటు చేసుకోమన్నారు. ప్రభుత్వం ఎరువుల ధర పెంచేసింది. ఈ ప్రభుత్వ హయాంలో పత్తి, మిర్చి,ధాన్యం ధరలు విపరీతంగా పడిపోయాయి.
 
 రైతుల ఉసురు పోసుకున్నారు...
 హైటెక్ ప్రభుత్వంలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యవురుు్యంది. నీటి తీరువా 100 శాతం పెంచారు. కరెంటు చార్జీలు 500 శాతం పెంచారు. ఆందోళనకు దిగిన వారిపై కాల్పులు జరిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు నేలకొరిగారు. మరో ఇద్దరు అవిటివారయ్యారు.
 
 ఎన్టీఆర్ అక్కౌంట్లను జప్తు చేరుుంచిన ఘనుడు
 చంద్రబాబు అధికారంలో ఉండగా పార్టీ ఫిరాయింపు చట్టం మూగపోయింది. చంద్రబాబు సారధ్యంలో తిరుగుబాటు చేసిన తెలుగు తవుు్మళ్లు తమదే అసలైన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎన్టీఆర్‌ను గద్దె దించేశారు. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ అధ్యక్షతన ఉన్న టీడీపీ అకౌంట్లను జప్తు చేయించారు. ఆపై.. ఎన్టీఆరే మా నాయకుడు, ఆయనే మాకు ఆదర్శవుని కపట ప్రేవు చాటారు. ఇదో రకం హైటెక్ ఆరాధన, భక్తి కాబోలు!
 
 నీది చీకటి రాజ్యం బాబూ...
 గృహ అవసరాలకు విద్యుత్ కోత ఉండదు. రెండేళ్లల్లో కరెంటు కోతలు లేకుండా చేస్తాం. వచ్చే ఏడాదిలోగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తాం. కరెంటు కోతలుంటే నాకు ఫోన్ చేయుండి.. ఇవన్నీ 1995 ఎన్నికల ప్రచారంలో బాబు హామీలు. ఆచరణలో రైతులకు పట్టువుని తొమ్మిది గంటల కరెంటు ఇవ్వలేదు. కరెంటు కోతలతో అనేక పరిశ్రవులు వుూతపడ్డారుు. కార్మికులు వీధుల్లో పడ్డారు. పట్టణాల్లో చీకటి రాజ్యం. అప్పుడప్పుడు కరెంటు పోవడం కాదు అప్పుడప్పుడు కరెంటు వస్తోంది. వర్షాకాలంలో సైతం నిత్యం కోతలే. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకూ వెతలే.
 
 పంటకు.. ఇంటికి విద్యుత్ చార్జీలు బాదుడే...
 ఎన్నికల వుుందు రూ.50లకే హార్స్‌పవర్ విద్యుత్ చార్జీలుంటే దానిని కొనసాగిస్తావుని చెప్పి రూ.250లకు పెంచేశారు. రైతులే ట్రాన్స్‌ఫార్మర్లు కొనుక్కునే పద్ధతిని ప్రవేశపెట్టారు. కొత్త కనెక్షన్ కోసం ఒక స్తంభం కన్నా ఎక్కువ ఉంటే విద్యుత్ కనెక్షన్ లేదన్నారు. గృహాలకు వాడే విద్యుత్ యుూనిట్ చార్జీలను అందరిపైనా భారం మోపారు.
 
 గృహ నిర్మాణానికి ‘చంద్ర’గ్రహణం
 వుూడేళ్లల్లో పేదలకు 21 లక్షల ఇళ్లను నిర్మిస్తావుని 1996 ఆగస్టు 24న వుుఖ్యవుంత్రి ప్రకటించి ఆచరణలో ఏడాదికి లక్ష గృహాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయులేదు. ఇళ్ల కేటారుుంపుల్ని రాజకీయుం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇళ్లను ఇస్తావుని, ఇతర పార్టీల వారికి కేటారుుంచే ప్రశ్నే లేదని గనులు, భూగర్భ శాఖ వుంత్రి ఎ.చంద్రశేఖర్ ప్రకటించారు. (1997 అక్టోబర్ 11, ఈనాడు)
 
 నిరుద్యోగులకు పంగనావూలు
 50 వేల ఉద్యోగాల భర్తీ. ఉద్యోగాలకు ఫీజు రద్దు. ఇంటర్వ్యూలకు హాజరైన వారికి ఉచిత బస్సు పాస్. రూ.25 దినసరి భత్యం చెల్లిస్తాం. (1996 ఫిబ్రవరి 22).. అని ప్రకటన. అదే ఏడాది జూలై 25న ఉద్యోగ ఖాళీల భర్తీపై నిషేధ ఉత్తర్వులు జారీ.
 
 మహిళలకు ఉత్త హామీలే...
 పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు రూ. ఆరు వేలు ఆర్థిక సాయుం (1996 ఏప్రిల్ 28). ఎన్నికల హామీ. టీవీలో ప్రకటన. జీవో జారీ. అరుుతే నిధులు వూత్రం విడుదల కాలేదు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల వుంజూరు, రేషన్ కార్డులు అన్నీ వుహిళలకే ఇస్తావున్న హామీ వూటలకే పరిమితం.
 
 మైనార్టీలకు మొండి చెయి
 ఉర్దూ విశ్వవిద్యాలయుం ఏర్పాటు. మైనార్టీ సంక్షేవుం కోసం బడ్జెట్‌లో రూ.20 కోట్లు, 30 వేల ఇళ్లు, ఇళ్ల స్థలాల్లో పది శాతం, వుసీదుల వురవ్ముతులకు రూ. కోటి నిధులు (1996 ఫిబ్రవరి 20) చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తర్వాత మొండి చెరుు్య ఇచ్చారు.
 
 మరో మిత్రపక్షం అభియోగాలు ఇవీ..
 చంద్రబాబు పాలనలో అవినీతి ఎంతగా పెరిగిందంటే ఆఖరుకు అప్పటి మిత్రపక్షమైన సీపీఐ కూడా పలు ఆరోపణలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్నవారు, అవినీతిపరులు ఏడుగురు మంత్రులుగా ఉన్నారని, వరంగల్, ఖమ్మం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో గంజారుు సాగు వెనుక అధికార పార్టీ నేతల హస్తవుుందని సీపీఐ బహిరంగ ఆరోపణలు చేసింది.
 
 హామీలు గాలికే...
 కూలీలు: వ్యవసాయు కూలీలకు కోటి ఎకరాలు పంచుతాం. నెలాఖరులోగా 35 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచుతాం.  అమలు కాని వీటికి చంద్రబాబే జవాబు చెప్పాలి.
 రైతులు: నెలాఖరులోగా పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ. నేటికీ 40 శాతం అందలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు, బోర్లు చెడిపోతే 24 గంటల్లో రిపేరు చేయుకపోతే కార్డు రాయుండి (1996 ఏప్రిల్ 22). కార్డుకు రిప్లై లేదు. కరెంటు సప్లై లేదు.
 రేషన్ కార్డులు: 19 లక్షల రేషన్ కార్డులు వారంలో పంపిణీ (1996 ఫిబ్రవరి 20). ఎన్నికల వుుందిచ్చిన హామీ ఆ తర్వాత కార్డుల ఏరివేత.
 సత్వర న్యాయుం: నిరుపేద గ్రామీణులకు సత్వర న్యాయం కోసం గ్రావు న్యాయూలయూల ఏర్పాటు (1996 జనవరి 9). సత్వర న్యాయువుంటే దశాబ్దవూ? లేక.. శతాబ్దవూ?
దళితుల ఉద్యోగాలు: ఎస్సీ, ఎస్టీల పోస్టుల భర్తీ (1995 సెప్టెంబర్ 11). ఇప్పటికీ 49 వేల పోస్టులు ఖాళీగా ఉన్నారుు.  
 
 ‘అన్న’చలువ కూడా లేదు..

 ఎన్టీ రావూరావు రూ.2కే కిలో బియ్యుం పథకాన్ని అవులు చేస్తే చంద్రబాబు సీఎం అయ్యూక ఆ ధరను రూ.వుూడున్నరకు పెంచేశారు. ఇదే పని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇదే చంద్రబాబు నానా గగ్గోలు పెట్టి అధికారంలోకి రాగానే కుటుంబానికి పాతిక కిలోల నుంచి పదహారు కిలోలకు బియ్యూ న్ని తగ్గించేశారు. 1996 జూన్ 25.. సబ్సిడీ బియ్యుం ధర ,  నీటితీరువా, వ్యవసాయు కరెంటు ఛార్జీలు, టర్నోవర్ ట్యాక్స్, ఎంటీ ట్యాక్స్, వృత్తిపన్ను, ఆర్టీసీ ఛార్జీలను పెంచారు. సంపూర్ణ వుద్యనిషేధాన్ని ఆదిలోనే తుంగలోకి నెట్టారు. సబ్సిడీ భారం తగ్గింది. పన్నుల పెంపు వల్ల ఆదాయుం కూడా ఎక్కువైంది. వురి ఆ డబ్బును ఏం చేశారో చంద్రబాబు సర్కార్ చెప్పదు.

 ఊడబీకిన రేషన్‌కార్డులు
 అర్హులందరికీ రేషన్‌కార్డులిస్తావుని 1995 డిసెంబర్ 9న వుుఖ్యవుంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచబ్యాంకు సలహా మేరకు ఉన్న కార్డులు రద్దు చేస్తున్నారు. పట్టణవాసులకు రూ.ఆరున్నరకే కిలో బియ్యుం ప్రకటనకే పరిమితం.  
 
 అవినీతిలో హైటెక్కులు
 అవినీతిపై రాజీ పునాదిగా కేంద్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథి తెలుగుదేశం నేత చంద్రబాబు. అవినీతిలో హైటెక్ విధానం అవలంబించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆఖరికి సొంత పార్టీ ఎంపీయే అవినీతికి వ్యతిరేకంగా దీక్షకు పూనుకున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంలో అవినీతి ఏ స్థారుుకి చేరిందంటే మిత్రపక్షమైన సీపీఐ కూడా ఆరోపణలు చేయూల్సి వచ్చింది. అవినీతి, క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్న ఏడుగురు చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నారని సీపీఐ ఆరోపించింది. ఖవ్ముం, వరంగల్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో గంజారుు సాగు, వ్యాపారం అధికారపార్టీ అండదండలు లేకుండా సాధ్యవూ?
 
 స్కాంల పుట్టలో చంద్రబాబు
 ఏలేరు కాలువ నిర్మాణానికి జరిగిన భూసేకరణకు పరిహారం చెల్లింపుల్లో రూ.14 కోట్లను హైటెక్ సీఎం పాలనలో లూటీ. ఈ స్కాంలో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ప్రమేయుం ఉందని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖ పోర్టు ట్రస్టు భూవుులకు నష్టపరిహారాన్ని.. భూపరిమితి చట్టం కింద మిగులు భూవుులకూ చెల్లించేశారు.
 
 ప్రాజెక్ట్‌లు పరార్
 2000 నాటికి లక్ష కోట్ల రూపాయుల పారిశ్రామిక పెట్టుబడుల లక్ష్యం (1996 అక్టోబర్ 19). గత ఏడాది రూ.3203 కోట్లతో 52 వుంది పరిశ్రవుల స్థాపనకు వుుందుకు వస్తే, ఈ ఏడాది రూ. 1003 కోట్లతో 26 కొత్త ప్రతిపాదనలు వూత్రమే అందారుు... చక్రం తిప్పేది వునమే అరుునా పెద్ద ప్రాజెక్టులు క ర్నాటక, తమిళనాడు కదలిపోయూరుు. హుండాయ్ కార్ల ప్రాజెక్టు వుంత్రి వూరన్ తన్నుకుపోతే, టయోటా కర్నాటకకు వూరిపోరుుంది. వులేషియూ ప్రోటాన్ కార్ల ప్రాజెక్టు అంతులేదు. కింగ్ మేకర్  టైటిల్ వునకు దక్కింది కానీ, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాలేదు. వున కరెంటు కోతలు, వూటల కోతలు వారిని భయుపెట్టాయేమో!
 
 పరిశ్రమల మూత
 రాష్ట్రంలో విద్యుత్ కొరత 35.8 శాతానికి పెరిగిపోరుుంది. దాంతో పరిశ్రవులు పెట్టేవాడు వున రాష్ట్రం వైపు చూసేందుకు సిద్ధంగా లేడు. రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని 15 సంస్థల్ని వుూసివేయూలని ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించింది. వీటిలో 40 వేల వుంది ఉద్యోగులున్నారు. నంద్యాల చెక్కెర ఫ్యాక్టరీ లే ఆఫ్ వల్ల ఏడు నెలలుగా జీతాలు లేక కేన్ సెక్షన్ క్లర్క్ వేణుగోపాల్  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 ‘పచ్చ’గానే అక్రమ మద్యం...
 నిషేధం ఉన్నా రాష్ట్రంలో వుద్యం ఉత్పత్తి అవుతోంది. అవ్ముకాలున్నారుు. సెకండ్స్ కూడా దొరుకుతున్నారుు. అక్రవు వుద్యం వ్యాపారంలో తెలుగుదేశం నాయుకులే పట్టుబడ్డారు. నిషేధం పేరుతో ప్రజలపై రూ.2,658 కోట్ల మేరకు పన్నుల భారాన్ని విధించేశాక.. వూఫియూ గ్యాంగుల తొలగింపునకే వుద్య నిషేధాన్ని ఎత్తివేస్తున్నావుని చంద్రబాబు ప్రకటించారు. సాక్షాత్తూ వుంత్రులు, ఎమ్మెల్యేలే  అక్రమ వుద్యం వ్యాపారాన్ని కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నారుు. అక్రవు వుద్యం రవాణాను పట్టుకున్న ఎస్సైను తొలగించారు. చివరికి నిషేధాన్ని ఎత్తివేసి నవ్ముకద్రోహానికి పాల్పడ్డారు.
 
 సీఎంకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ఈ అక్రవు వ్యాపారానికి సూత్రధారి. సీఎం సోదరుడు, ఎమ్మెల్యే నారా రావుూ్మర్తినాయుడు పేరు కూడా అక్రవు వుద్యం వ్యాపారుల జాబితాలో ఉంది. డిస్టిలరీలు,బ్రూవరీలకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా సంతకాలు చేసిన మంత్రి కనువుూరి బాపిరాజు రాజీనావూ చేయూలని టీడీపీ డిమాండ్ చేసింది. అదే డిస్టిలరీల ఫైళ్లపై నిషేధం అమలు ఉండగానే చంద్రబాబు సర్కార్ సంతకాలు పెట్టేసింది. అక్రమ మద్యం వ్యాపారానికి టీడీపీ అండదండలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement