దక్షిణమధ్య రైల్వే కొత్త జీఎంగా వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్‌గా వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎంగా ఉన్న రవీంద్రగుప్తా రైల్వే బోర్డు సభ్యు డిగా నియమితులు కావటంతో ఆయన స్థానంలో వినోద్‌కుమార్ వచ్చారు. 1980వ బ్యాచ్ ఇండియన్‌రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (ఐఆర్‌ఎస్‌ఈఈ)కు చెందిన ఈయన ఇప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ వర్సిటీ నుంచి ఎంబీఏ మాస్టర్ డిగ్రీ పట్టా, అలహాబాద్ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సహకార ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాల రూపకల్పన, ప్రపంచ బ్యాంకు, జైకా ప్రాయోజిత ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం వినోద్‌కు ఉంది. రైల్వేల్లో 1982లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా విధుల్లో చేరిన ఆయన ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏడీఆర్‌ఎం ఢిల్లీ, లక్నో డీఆర్‌ఎంగా పనిచేశారు. డిప్యుటేషన్‌పై డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూఎన్‌ఐడీఓ, ఆర్‌సీఓఎన్ తదితర సంస్థల్లో పనిచేసిన విశిష్ట అనుభవం ఉంది. టర్కీలోని ఐఆర్‌సీఓఎన్ డిప్యూటీ మేనేజర్‌గానూ వినోద్‌కుమార్ పనిచేశారు.