Ravindragupta
-
దక్షిణమధ్య రైల్వే కొత్త జీఎంగా వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్‌గా వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎంగా ఉన్న రవీంద్రగుప్తా రైల్వే బోర్డు సభ్యు డిగా నియమితులు కావటంతో ఆయన స్థానంలో వినోద్‌కుమార్ వచ్చారు. 1980వ బ్యాచ్ ఇండియన్రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఈఈ)కు చెందిన ఈయన ఇప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ వర్సిటీ నుంచి ఎంబీఏ మాస్టర్ డిగ్రీ పట్టా, అలహాబాద్ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సహకార ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాల రూపకల్పన, ప్రపంచ బ్యాంకు, జైకా ప్రాయోజిత ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం వినోద్‌కు ఉంది. రైల్వేల్లో 1982లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా విధుల్లో చేరిన ఆయన ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏడీఆర్ఎం ఢిల్లీ, లక్నో డీఆర్ఎంగా పనిచేశారు. డిప్యుటేషన్‌పై డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూఎన్ఐడీఓ, ఆర్సీఓఎన్ తదితర సంస్థల్లో పనిచేసిన విశిష్ట అనుభవం ఉంది. టర్కీలోని ఐఆర్సీఓఎన్ డిప్యూటీ మేనేజర్‌గానూ వినోద్‌కుమార్ పనిచేశారు. -
రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి
అధికారులకు రైల్వే జీఎం రవీంద్రగుప్తా సూచన సాక్షి, హైదరాబాద్: అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ, సమయపాలనను మరింత మెరుగుపరచాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సూచించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. రైళ్ల నిర్వహణలో భద్రతాపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల న్నారు. కాపలాలేని గేట్లు ఒక ప్రధాన సమస్య అని, వాటి వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వేలోని క్యాంటీన్లు, ట్రైనింగ్ సెంటర్ల వద్ద సహజ ఎరువుల తయారీకి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘రైల్ హమ్‌సఫర్ సప్తాహ్’.
వారం పాటు పలు అంశాలపై ప్రచారం సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలపై ఈ నెల 26 నుంచి జూన్ 1 వరకు దక్షిణ మధ్య రైల్వే ‘రైల్ హమ్‌సఫర్ సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, అదనపు జనరల్ మేనేజర్, వివిధ డివిజన్లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్లు, అధికారులు ఈ వారోత్సవాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ‘స్వచ్ఛ దివస్’ నిర్వహిస్తారు. 2వ రోజు ‘సత్కార్ దినోత్సవ్’లో భాగంగా స్టేషన్లు, రైళ్లలోని ఆహార కేంద్రాల్లో పరిశుభ్రత, తినుబండారాల నాణ్యతాప్రమాణాలు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. మూడో రోజు ‘సేవా దివస్’లో భాగంగా అన్ని రైళ్లలో సదుపాయాలు, సేవలపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపడతారు. 4వ రోజు సతర్కతా దినోత్సవంలో భాగంగా అన్ని రైళ్లు నిర్ణీత సమయానికి అనుగుణంగా నడుస్తున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తారు. 5వ రోజు ‘సామంజస్య దినోత్సవ్’లో భాగంగా అన్ని రైల్వే కాలనీల్లో ఇళ్ల నిర్వహణ, పరిశుభ్రతలపై తనిఖీలు నిర్వహిస్తారు. 6వ రోజు నిర్వహించే ‘సంయోజన్ దినోత్సవ్’లో పెద్ద ఎత్తున సరుకు రవాణా చేసే ఖాతాదారులతో జనరల్ మేనేజర్, డీఆర్ఎంలు సమావేశాలు నిర్వహించి రవాణా విభాగంలో రైల్వేశాఖ సంస్కరణలను వివరిస్తారు. 7వ రోజు జూన్ 1వ తేదీన జరిగే ‘సంచార్ దినోత్సవ్’లో ఈ వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలను సమీక్షిస్తారు. -
రెండు భారీ రైల్వే టెర్మినళ్లు
♦ వట్టినాగులపల్లి, చర్లపల్లిలో ఏర్పాటు ♦ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగానే పనులు మొదలు ♦ మనకు గతిమాన్ రైళ్లు రావటానికి ఆలస్యమవుతుంది ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో నగరానికి రెండు వైపులా విశాలమైన రెండు భారీ టెర్మినళ్లు నిర్మించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ రైల్వేస్టేషన్లు ఇరుకుగా మారిన నేపథ్యంలో వట్టినాగులపల్లి, చర్లపల్లి స్టేషన్లను విస్తరించి భారీ టెర్మినళ్లు నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలి రైల్వే బడ్జెట్లో వాటికి అనుమతి మంజూరైనందున ఈ ఏడాదే పనులు మొదలుపెడతామన్నారు. చర్లపల్లిలో 150 ఎకరాలు, నాగులపల్లిలో 300 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. ఆ కేటాయింపు జరగ్గానే పనులు మొదలుపెడతామని చెప్పారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టబోయే పనుల వివరాలను రవీంద్ర గుప్తా బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. రెండు బడ్జెట్లకు పూర్వం మనకు 2 గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరయ్యాయి. ఢిల్లీ-ఆగ్రా రైలు పట్టాలెక్కిన నేపథ్యంలో మనవి ఎప్పట్లోగా అందుబాటులోకొస్తాయి? ఢిల్లీ-ఆగ్రా మధ్య 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే గతిమాన్ సెమీ బుల్లెట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కినందున రెండేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన ఇలాంటి రెండు రైళ్లపై దృష్టి మళ్లటం సహజం. కానీ అంత వేగంగా రైళ్లు దూసుకెళ్లేందుకు వీలుగా రైల్వే లైనును బలోపేతం చేయాల్సి ఉంది. ఢిల్లీ-ఆగ్రా మధ్య ఆ పని పూర్తయ్యాకనే రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-చెన్నై, కాచిగూడ-నాగ్‌పూర్ గతిమాన్ రైళ్లు ప్రారంభం కావాలంటే లైన్ బలోపేతం జరగాలి. స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు నత్త నడకకు కారణం? కొన్ని స్టేషన్లలో స్థలాభావం వల్ల పనుల్లో ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు వేగిరం చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం జోన్ పరిధిలో 7స్టేషన్లలో 9 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది 12 ఎస్కలేటర్లు, 27 లిఫ్టులు ఏర్పాటు చేయబోతున్నాం. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం ఆదాయం ఎలా ఉంది..? తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.13,212 కోట్లు(అంతకుముందు ఏడాది రూ.13,072 కోట్లు) దక్షిణ మధ్య రైల్వే ఆదాయాన్ని పొందింది. ఇందులో సరుకు రవాణా ద్వారానే రూ.9,225 కోట్లు ఉండగా, ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.3,312 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే ఆదాయం పెరగటం సంతోషంగా ఉంది. ఈసారి పెరుగుదల ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నిర్వహణ వ్యయాన్ని 78 శాతానికి కట్టడి చేయటం ద్వారా నష్టాలను తగ్గించగలిగాం. ఏపీకి ప్రత్యేక జోన్ అసలు ఉంటుందా..? అది రైల్వే బోర్డు పరిధిలో ఉన్న అంశం. బోర్డు నుంచి స్పష్టత వస్తే గాని దాని గురిం చి చెప్పలేం. దానిపై ఏర్పడ్డ కమిటీ సమర్పించిన నివేదికను బోర్డు పరిశీలిస్తోంది. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా చూసే వ్యవస్థ ఎంతవరకు వచ్చింది? ఆర్డీఎస్వోతో కలసి సొంతంగా అభివృద్ధి చేసిన పరిజ్ఞానం ఇది. ప్రయోగాత్మకంగా వికారాబాద్-వాడీ సెక్షన్లో పరిశీలించినప్పుడు విజయవంతమైంది. నేను కూడా కొద్ది రోజుల క్రితం పరిశీలించాను. త్వరలో దీనికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తుంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది.. మీరేమంటారు? శివారు ప్రాంత ప్రజలు సులభంగా నగరంలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఎంఎంటీఎస్ రెండో దశ పనులను వేగంగా జరుపుతాం. ఈ ప్రాజెక్టులో లేనప్పటికీ కొత్తగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించే పనికి శ్రీకారం చుట్టాం. ఈ పనుల నిర్వహణ బాధ్యతను ఆర్వీఎన్ఎల్ సంస్థకు అప్పగించమని బోర్డు ఆదేశించింది. వీలైనంత తొందరలోనే పనులు మొదలవుతాయి. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇక రానట్టేనా..? గతంలో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేసిన మాట నిజమే. కానీ తాజా బడ్జెట్లో దాన్ని మార్చి వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ కేటాయించారు. దీని పనులు వెంటనే మొదలుపెడతాం. ప్రాథమిక స్థాయి పనుల కోసం తాజా బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించారు. ఈసారి దీని విషయంలో జాప్యం లేకుండా చూస్తాం. కొత్త లైన్లు, ట్రిప్పింగ్ పనుల్లో వేగం లేకపోవడం ఆందోళన కలిగించట్లేదా? దానికి కారణాలనేకం. దేశవ్యాప్తంగా ఆయా పనులకే పరిమితంగా నిధులు అందుతాయి. ప్రాధాన్యతాక్రమంలో వాటిని కొనసాగిస్తాం. ఇటీవల 177 కి.మీ. మేర కొత్త లైన్లు/ట్రిప్లింగ్ చేశాం. జగిత్యాల-మోర్తాడు, ఎర్రగుంట్ల-బనగానపల్లి, మేళ్లచెరువు-మాతంపల్లి, మందమర్రి-మంచిర్యాల, రామగుండం-పెద్దంపేట పరిధిలో వేగంగానే పనులు సాగాయి. గుత్తి-ధర్మవరం మధ్య ఎలక్ట్రిఫికేషన్ పూర్తయ్యింది. -
దక్షిణమధ్య రైల్వేకు ఏడు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఉద్యానవనాల పరిరక్షణలో అవార్డుల పంట పండించుకుంది. రాష్ట్ర ఉద్యానవనశాఖ నుంచి ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యానవన శాఖ 2వ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. 150 చదరపు మీటర్లకు పైగా ఉద్యానవనం ఉన్న దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా నివాస భవనం మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. కిచెన్ గార్డెన్ విభాగంలో కూడా జీఎం నివాసం రెండో బహుమతిని సొంతం చేసుకుంది. దక్షిణ లాలాగూడలోని హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణాసింగ్ నివాసంలోని గార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ఎస్.ఎన్.సింగ్ నివాసం, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ నివాసంలోని గార్డెన్లకు వరుసగా బహుమతులు లభించాయి. రూఫ్ గార్డెన్ విభాగంలో సికింద్రాబాద్ రైల్ నిలయం 2వ బహుమతిని అందుకుంది. మొత్తంగా 7 బహుమతులు దక్షిణమధ్య రైల్వేకు లభించడం పట్ల జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యానవనాల నిర్వహణ, పరిరక్షణలో అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు.