రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి | Enhance timing of trains | Sakshi
Sakshi News home page

రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి

Published Tue, Nov 15 2016 3:33 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి

రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి

అధికారులకు రైల్వే జీఎం రవీంద్రగుప్తా సూచన
 
 సాక్షి, హైదరాబాద్: అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ, సమయపాలనను మరింత మెరుగుపరచాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సూచించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో రైల్ నిలయంలో  సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. రైళ్ల నిర్వహణలో భద్రతాపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల న్నారు.

కాపలాలేని గేట్లు ఒక ప్రధాన సమస్య అని, వాటి వద్ద భద్రతా  చర్యలను పటిష్టం చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వేలోని క్యాంటీన్‌లు, ట్రైనింగ్ సెంటర్‌ల వద్ద సహజ ఎరువుల తయారీకి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement