ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న 2016-17 ఆర్థిక సంవత్సరం తాలూకు సాధారణ బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)పై చర్చ ముగిసిన వెంటనే డివిజన్
స్పీకర్‌కు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో చర్చకు రానున్న 2016-17 ఆర్థిక సంవత్సరం తాలూకు సాధారణ బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)పై చర్చ ముగిసిన వెంటనే డివిజన్ ద్వారా ఓటింగ్‌ను నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం.. స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్త్తి చేసింది. శాసనసభాపక్షం కార్యదర్శి రావు సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం ఈ మేరకు స్పీకర్‌కు లేఖ అందజేశారు. శాసనసభ్యుల పేర్ల సహితంగా లెక్కింపు జరపాలని ఆయన లేఖలో కోరారు.
విప్ జారీపై స్పీకర్‌కు సమాచారం..: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొని, ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేయాలని వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలందరికీ పార్టీ విప్ జారీ చేశామని కూడా మరో లేఖలో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం కార్యదర్శి రావు సుజయ్‌కృష్ణ రంగారావు స్పీకర్‌కు తెలియజేశారు. లేఖతోపాటు వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను కూడా ఆయన స్పీకర్‌కు అందజేశారు.