రిటైర్డ్ ఇంజనీర్ల తీర్మానం
సాక్షి, హైదరాబాద్: పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఫ్లోరైడ్ బాధిత మండలాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు శ్రీశైలం నుంచి 2.75 టీఎంసీలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్లు నిర్ణయించారు. శ్రీశైలం నుంచి తీసుకునే 2.75 టీఎంసీలలో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో 0.75 టీఎంసీ డిండికి కేటాయించేలా చూడాలని తీర్మానించారు.
ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. బుధవారం ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సంయుక్త భేటీ నిర్వహించింది. సమావేశంలో పాలమూరు, డిండి పరిధిలో నెలకొన్న వివాదాలపై చర్చించారు. సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్ర మౌళి, రాంరెడ్డి, రమేశ్‌రెడ్డి, డి.గోవర్ధన్‌రెడ్డి, ఎన్.రఘుమారెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలం నుంచి నీటి సేకరణ పెంచాలి
Published Thu, Aug 17 2017 3:01 AM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM
Advertisement