ప్రజాసమస్యలపై పోరాడితే పవన్‌కు మద్దతు | Will support to the pavan if he fight for the people | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై పోరాడితే పవన్‌కు మద్దతు

Published Thu, Apr 14 2016 2:01 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ప్రజాసమస్యలపై పోరాడితే పవన్‌కు మద్దతు - Sakshi

ప్రజాసమస్యలపై పోరాడితే పవన్‌కు మద్దతు

 పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైతే ‘జనసేన’ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం అన్నారు. ఇందిర భవన్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. క్రియాశీల రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రావడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందన్నారు.

ఆయన మొదట రాష్ట్రమంతా పర్యటించి ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకొని వాటిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన హామీలపై ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం తదితరఅంశాలపై పవన్ కల్యాణ్ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement