హైదరాబాద్: ఇంటిని అమ్ముతానని చెప్పి ఒప్పందం చేసి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ మహిళను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సౌభాగ్యపురం కాలనీలోని ఓ ఇంటిని కోటి రూపాయలకు అమ్మేందుకు శారద అనే మహిళ అదే కాలనీకి చెందిన అనుపమ అనే మహిళతో ఒప్పందం చేసుకుని ముందుగా రూ.30 లక్షలు తీసుకుంది. అయితే అదే ఇంటిని గతంలో కృష్ణారెడ్డి అనే వ్యక్తికి రూ.45 లక్షలకు విక్రయ ఒప్పందం చేసినట్లు తెలుసుకున్న అనుపమ తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో శారద ఆమె భర్త, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు డబ్బులు అడిగేందుకు ఇంటికి వెళ్లిన అనుపమను బెదిరించారు.
దీంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం శారదను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గతంలో కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసులో శారద అరెస్ట్ అయిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు భర్త, కొడుకులు, కోడళ్ళపై కూడా కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
చీటింగ్ కేసులో మహిళ అరెస్ట్
Published Sat, May 7 2016 8:48 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement