న్యూడ్ ఫోటోలతో మహిళ బ్లాక్ మెయిల్
హైదరబాద్ : న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.... హాస‍్టల్‌లో ఉన‍్న రూమ్‌మేట‍్లను నగ‍్నంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని తను పనిచేసే యజమానికి వాట‍్సప్‌లో పంపిన యువతితో పాటు ఆమెకు సహకరించిన వారిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ‍్డగుట‍్టలోని ఓ లేడీస్ డీలక్స్ హాస్టల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
విజయ అనే మహిళ ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తూ హాస‍్టల్‌లో ఉంటోంది. ఆమె గత కొంత కాలంగా తన రూమ‍్మేట‍్లను నగ‍్నంగా ఫోటోలు, వీడియోలు తీయడంతోపాటు వాటిని తాను పనిచేస్తున‍్న కంపెనీ యజమాని శివయ‍్యకు వాట‍్సప్‌లో పంపించింది. ఆ తర్వాత ఆ యువతులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బాధితులు.. విజయపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సైబర్ పోలీసులకు అప‍్పగించారు. వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.