పెళ్లయిన మూడు రోజులకే భర్త తనను వదిలేసి లండన్ పారిపోయాడంటూ బుధవారం ఓ యువతి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది
హైదరాబాద్: పెళ్లయిన మూడు రోజులకే భర్త తనను వదిలేసి లండన్ పారిపోయాడంటూ బుధవారం ఓ యువతి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. మోసం చేసిన తన భర్తపై చర్యలు తీసుకోవాలని గతంలో గుంటూరు జిల్లా బాపట్ల, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధితురాలు స్వప్న పేర్కొంది. ఎన్నారై భర్తతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ఫిర్యాదు అందుకున్న హెచ్చార్సీ.. జూన్ 21వ తేదీలోగా సమగ్ర నివేదిక అందించాలని గుంటూరు రూరల్ ఎస్పీని ఆదేశించింది.