రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.
హైదరాబాద్: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ కుమారుడు మహ్మద్ జహంగీర్ (26) మార్బుల్ ఫ్లోరింగ్ పని చేస్తుంటాడు.
భార్యను తీసుకెళ్లడానికి జహంగీర్ అత్తగారింటికి వచ్చాడు. భార్య ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లడానికి గురువారం రాత్రి యాకత్‌పుర - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.