'డ్రంక్ అండ్ డ్రైవ్' నుంచి తప్పించుకోబోయి.. | youth dies while ferring from police who were conducting drunk and drive | Sakshi
Sakshi News home page

'డ్రంక్ అండ్ డ్రైవ్' నుంచి తప్పించుకోబోయి..

Published Sat, Nov 7 2015 7:12 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

youth dies while ferring from police who were conducting drunk and drive

హైదరాబాద్: ఇద్దరు యువకులు ఫుల్లుగా మద్యంసేవించి వాహనం నడుపుతున్నారు. ఓ మలుపు వద్ద మాటేసిన పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. పోలీసుల పరీక్షల్లో ఇద్దరు యువకులూ మద్యం సేవించినట్లు తేలింది. అంతలోనే అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్న యువకులు బైక్ స్పీడ్ పెంచి దూసుకెళ్లారు.

 

కానీ, అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటనలో గాయపడ్డ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement