శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైఎస్ జగన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ : అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం సక్సెస్‌పై ఆయన ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలతో పాటు మిలిటరీ కృషిని వైఎస్ జగన్ ప్రశంసించారు. కాగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల కలామ్ ఐల్యాండ్ నుంచి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏప్రాంతాన్నైనా అగ్ని-5లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.