హైదరాబాద్: ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు.