హైవేపై ఘోర రోడ్డుప్రమాదం: 10 మంది మృతి | 10 killed in highway crash in Mexico | Sakshi
Sakshi News home page

హైవేపై ఘోర రోడ్డుప్రమాదం: 10 మంది మృతి

Published Sat, Jun 25 2016 10:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

10 killed in highway crash in Mexico

మెక్సికో:  అతివేగంగా వస్తున్న ఓ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 10 మంది దుర్మరణం చెందగా, 33 మందికి గాయలయ్యాయి. ఈ ఘటన మెక్సికోలోని సీయోదాద్ జురేజ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు మెక్సికో అధికారులు శనివారం వెల్లడించారు. టెక్సస్లోని రీయో గ్రాండె మీదుగా టోరెంటో నుంచి జురేజ్కు వెళుతున్న బస్సు మెట్రోపొలిస్ వద్ద వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో  ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతిచెందారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను సీయోదాద్ జురేజ్ ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement