సింగపూర్ను వణికిస్తున్న జికా
సింగపూర్: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ ఇప్పుడు సింగపూర్ను వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ 115 మంది జికా వైరస్ బారినపడగా.. తాజాగా ఓ గర్భిణీ మహిళకు ఈ వ్యాధి నిర్థారణ జరిగింది. జికా వ్యాధి సోకిన వారి ఇంట్లో ఉన్న ప్రెగ్నెంట్ మహిళకు వ్యాధి సోకినట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. జికా వ్యాధి అక్కడ వేగంగా వ్యాపిస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి పలు దేశాలు ప్రెగ్నెంట్ మహిళలు సింగపూర్కు వెళ్లొద్దంటూ తమ పౌరులకు సూచించాయి.
జికా నిర్మూలనకు సింగపూర్ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దోమలను నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది. జికా నిర్మూలనకు తమ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ తెలిపారు. సింగపూర్లో మొదటి జికా కేసును గత నెలలో ఓ మలేసియా మహిళలో గుర్తించారు.