Zika
-
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోన్న జికా వైరస్
-
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
దోమలకు దోమలే విరుగుడు..!!
టౌన్స్విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్‌విల్‌లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్‌విల్‌లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. -
30 నిమిషాల్లో ‘జికా’ను గుర్తించే యాప్
వాషింగ్టన్: జికా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే మొబైల్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్‌తో నియంత్రించగల, బ్యాటరీతో నడిచే డయాగ్నొస్టిక్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం విలువ కేవలం 100 డాలర్లు (సుమారు రూ.6,500) మాత్రమే. ఈ ఆవిష్కరణలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు. ‘పరికరాన్ని అపరేట్ చేయడంలో కొత్త యాప్ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. సంప్రదాయ లేబొరేటరీ విశ్లేషణ పరికరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని అమెరికాలోని సాండియా నేషనల్ లేబొరేటరీస్‌కు చెందిన ఆశిశ్ ప్రియే తెలిపారు. ల్యాంప్ (లూప్– మీడియేటెడ్ ఐసోథర్మల్ ఆంప్లిఫికేషన్) డయాగ్నొస్టిక్ పద్ధతిపై ఆధారపడి ఈ పరికరం పనిచేస్తుంది. -
జికా తర్వాత మయారో...!
ఈ ఏడాది మొదట్లో జికా ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ‘మయారో’ అనే జబ్బు పొంచి ఉందని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు... వరసగా రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, క్రిమియన్-కాంగో హ్యామరేజిక్ ఫీవర్ వంటివి క్యూలో నిలబడి తమ వంతుకోసం వేచి చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మయారో అనేది దాదాపు చికన్‌గున్యా వ్యాధి లక్షణాలనే పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇది కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుందనీ, ఇలా చికన్గున్యాతో పోలికలు ఉన్నందున కీళ్లనొప్పులతో ఇది మానవాళిని వేధించనుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికన్’ అనే మ్యాగజైన్ వెల్లడించింది. అలాగే ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ అంచనాల ప్రకారం... ‘రిఫ్ట్ వ్యాలీ ఫీవర్’ అనేది ఇతర జంతుజాలాల్లో చాలా సాధారణంగా కనిపిస్తుందనీ, ఇలా ఇతర జంతువుల్లో కనిపించే వ్యాధులు... ఆ తర్వాత మానవాళిలో (హ్యూమన్ బీయింగ్) కనిపించాయి కాబట్టి ఇది కూడా మనుషుల్లో కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ‘క్రిమియన్-కాంగో హేమరేజిక్ ఫీవర్’ అనే వ్యాధి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతోంది. జంతుజాలం మీద ఉండే కీటకాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, ఒంటినొప్పులు, మగతగా ఉండటం, మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. డెంగ్యూలాగే అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇది వచ్చినప్పుడు చాలా అపాయకరంగా పరిణమించవచ్చని ఆందోళన చెందుతోంది డబ్ల్యూహెచ్ఓ. ‘మయారో’ లాగే ‘యుసుటు’ అనే మరో జబ్బు కూడా వచ్చే అవకాశం ఉందనీ, ఇది ‘వెస్ట్ నైల్ వైరస్’లాగే ఉంటుందని హెచ్చరిస్తోంది ‘సైంటిఫిక్ అమెరికన్’ మ్యాగజైన్. పక్షుల్లో ఇది అప్పటికే ఉంది. క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకూ వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆ సైన్స్ జర్నల్. -
మనకూ ముంచుకొస్తున్న జికా ముప్పు!
లండన్: ఆగ్నేయ ఆసియా దేశమైన సింగపూర్ లో తాజాగా జికా వైరస్ కనిపించిన నేపథ్యంలో మిగిలిన ఆసియా దేశాలకూ ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గణనీయంగా మారుతున్న వాతావరణ, విదేశీ ప్రయాణాలు, దోమల బెడదలను బట్టి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వీటిలో భారత్, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, నైజీరియా, వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు జికా వైరస్ పాకే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దేశాల్లోని ప్రజలకు గతంలోనే జికా వైరస్ సోకినా.. వ్యాధి లక్షణాలు, తీవ్రత బయటకు కనిపించకపోవడం వల్ల గుర్తించలేకపోయి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. వాస్తవానికి 1947లోనే జికా వైరస్ ను గుర్తించినా.. వ్యాధి కారణంగా పెద్దగా ఆరోగ్యసమస్యలేవీ లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. గత ఏడాది బ్రెజిల్ లో గర్భస్థ శిశువులు, గర్భిణీ స్త్రీలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ ఓ) జికా వైరస్ వ్యాప్తిపై ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 70 దేశాల్లో జికా ఆనవాళ్లు ఉన్నాయని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. దోమల ద్వారా, సెక్స్ , రక్త మార్పిడిల ద్వారా జికా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. తాము చేసిన పరిశోధనలు దేశాలు నష్టాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు అన్నారు. -
సింగపూర్‌ను వణికిస్తున్న జికా
సింగపూర్: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ ఇప్పుడు సింగపూర్‌ను వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ 115 మంది జికా వైరస్ బారినపడగా.. తాజాగా ఓ గర్భిణీ మహిళకు ఈ వ్యాధి నిర్థారణ జరిగింది. జికా వ్యాధి సోకిన వారి ఇంట్లో ఉన్న ప్రెగ్నెంట్ మహిళకు వ్యాధి సోకినట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. జికా వ్యాధి అక్కడ వేగంగా వ్యాపిస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి పలు దేశాలు ప్రెగ్నెంట్ మహిళలు సింగపూర్‌కు వెళ్లొద్దంటూ తమ పౌరులకు సూచించాయి. జికా నిర్మూలనకు సింగపూర్ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దోమలను నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది. జికా నిర్మూలనకు తమ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ తెలిపారు. సింగపూర్‌లో మొదటి జికా కేసును గత నెలలో ఓ మలేసియా మహిళలో గుర్తించారు. -
జికా, డెంగ్యూలకు దగ్గరి సంబంధం!
లండన్: శిశువు చిన్న తలతో జన్మించడానికి కారణమౌతున్న జికా వైరస్‌కు వ్యక్సిన్ను కనుగొనే క్రమంలో శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు. గతంలో డెంగ్యూ వైరస్ బారిన పడిన వారిలో జికా వైరస్ ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తోందని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇటీవల జికా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన బ్రెజిల్ లాంటి దేశాల్లో.. గతంలో డెంగ్యూ ప్రభావానికి గురైన వారిలో ఈ వ్యాధి విజృంభించిందని గుర్తించారు. డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేసే దోమలే జికా వైరస్‌ను కూడా వ్యాప్తి చేస్తాయి. జికా, డెంగ్యూ వ్యాధులను కలిగించే వైరస్లు రెండూ ఒకే ఫ్యామిలీకి చెందినప్పటికీ.. డెంగ్యూ వ్యాధి, జికా అంత ప్రమాదకరమైనది కాదు. అయినప్పటికీ ఈ రెండింటికీ మధ్య సంబంధముందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. డెంగ్యూ వైరస్‌కు ఉపయోగించే తరహా వ్యాక్సిన్ జికా వైరస్‌ను అరికట్టడంతో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాధమిక భావన మాత్రమే అని.. ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వారు వెల్లడించారు. -
అమెరికాలో మొదటి 'జికా' మామ్!
న్యూ జెర్సీః పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. కాగా తాజాగా అమెరికాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి జికా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్థారణ చేశారు. న్యూజెర్సీ లోని ఆసుపత్రిలో జికా వైరస్ తో ఉన్నతల్లి ప్రసవించిగా ఆమెకు చిన్న తలతో ఉన్న శిశువు జన్మించినట్లు వైద్యాధికారులు గుర్తించారు. స్పష్టంగా జికా వైరస్ లక్షణాలు కలిగిన ఇటువంటి కేసు అమెరికా ట్రై స్టేట్స్ లో ఇదే మొదటిసారి అని ఇడా సీగల్ నివేదించింది. దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి సోకి, కలకలం రేపుతున్న జికా వైరస్... మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది.అయితే ఈ వైరస్ వల్ల ఇతరుల్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా గర్భిణులకు సోకితే మాత్రం పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తుతాయంటూ వైరస్ ను నిలువరించేందుకు డబ్ల్యూహెచ్ వో భారీ కసరత్తు చేస్తోంది. ఈడిస్ ఈజిప్టె రకం దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నజికా వైరస్... సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా... గర్భిణిలపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాలుగా మారింది. మైక్రో సెఫలి వ్యాధి బారినపడ్డ బిడ్డ.. అమెరికాలోని న్యూజెర్సీ ఆస్పత్రిలో జన్మించింది. ఇలా జికా వైరస్ సోకిన తల్లి ఆమెరికాలోని ఆస్పత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి అని హాకెన్‌సాక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధికారులు అంటున్నారు. అయితే ఆ తల్లి.. పూర్తి వైద్య సంరక్షణ అందుకుందని చెప్పిన అధికారులు.. ఆమె గోప్యతను గౌరవిస్తూ... ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఆమె హోండురాస్ కు చెందిన 31 ఏళ్ళ వయసున్న మహిళ అని ఓ వార్తా పత్రిక వెల్లడింరగా... గర్భం ప్రారంభ దశలోనే ఆమె.. దోమకాటు వల్ల జికా బారిన పడిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అల్ట్రా సౌండ్ టెస్ట్ లో లోపాలు కనిపించడంతో వైద్యులు 35 వారాల గర్భంతో ఉన్న ఆమెకు మంగళవారం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డ.. తక్కువ బరువుతోపాటు, మైక్రోసెఫలీ వ్యాధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తల్లికి గర్భంతో ఉన్న సమయంలో శరీరంపై కొద్దిపాటి రాష్ తప్పించి.. మిగిలిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు. -
వామ్మో వైరస్! ఒలింపిక్స్ వాయిదా వేయండి!
వాషింగ్టన్: బ్రెజిల్లో జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి లేదా వేరోచోటుకి తరలించాలని 100 మందికిపైగా ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. 'జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా విజృంభిస్తుండటంతో తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 'ప్రపంచ ఆరోగ్యంపై ఆందోళనతోనే మేం ఈ లేఖ రాస్తున్నాం. బ్రెజిల్లో విశ్వక్రీడల వల్ల సైన్స్ గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో జికా వైరస్ విజృంభించే అవకాశముంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఒలింపిక్స్ క్రీడలను రద్దు చేయడం లేదా వేరేచోటుకు మార్చడం వల్ల అంతర్జాతీయంగా జికా వైరస్ వ్యాప్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని తమ ప్రాథమిక పరిశోధనలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. -
దోమలకు వలవేస్తాయి!
టొరంటో: డెంగ్యూ, మలేరియా, జికా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న దోమలను అరికట్టేందుకు కెనడా శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. దోమలను ఆకర్షించడం, అవి పెట్టిన గుడ్లను నాశనం చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఇందుకోసం ఓవిల్లాంట అనే పరికరాన్ని తయారు చేశారు. దీనికోసం పనికిరాని పాత కారు టైర్లను సుమారు 50 సెంటీమీటర్ల పొడవుతో కోసి ఒకదానిపై ఒకటి ఉంచి.. ఇలా ఓ ఫ్రేమ్‌లో బిగించారు. కిందిభాగంలో పాలతో తయారు చేసిన ఓ ద్రావణాన్ని (దీనిని కెనడాలోని లారెంటియన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు) నింపారు. ద్రావణంపైన ఓ పేపర్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. ఈ ద్రావణానికి ఆడ దోమలను ఆకర్షించే గుణం ఉండడంతో అవి ఒవిల్లాంటాలోకి చేరి అందులోని పేపర్ స్ట్రిప్‌పై గుడ్లుపెట్టడం మొదలుపెట్టాయి. వారానికోసారి ఆ పేపర్ స్ట్రిప్‌ను బయటకు తీసి దానిపైన ఉన్న గుడ్లను ఇథనాల్‌తో నాశనం చేశారు. ఇలా కేవలం ఒక నెలలోనే 18,100 దోమల గుడ్లను నాశనం చేశారు. దోమలను అంతమొందించడం కంటే వాటి గుడ్లను నాశనం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దోమలను అరికట్టేందుకు వినియోగిస్తున్న రకరకాల ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలను వినియోగిస్తున్నందున అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ఓవిల్లాంటాతో అటువంటి ఇబ్బందులేమీ ఉండవని చెబుతున్నారు. -
లైంగిక చర్యతో కూడా జికా వ్యాప్తి!
న్యూయార్క్: జికా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. ప్రెగ్నెన్సీ మహిళలు దీని బారిన పడితే వారికి పుట్టే పిల్లల్లో తల పరిమాణం చిన్నదిగా ఉండి మెదడుకు సంబంధించిన ఎదుగుల తక్కువగా ఉంటోంది ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల కాలంలో జికా వైరస్ ప్రభావానికి గురైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకూ జికా వైరస్ దోమ కాటు ద్వారానే వ్యాప్తి చెందుతుందని భావిస్తూ వచ్చారు. ఎడీస్ ఈజిప్టి దోమ జికా వైరస్‌ను వ్యాప్తి చెస్తోంది. అయితే లైంగిక చర్య ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జికా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి రక్తంతో పాటు వీర్యం శాంపిల్స్‌లో కూడా రెండు వారాల పాటు వైరస్ ఉనికిని గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. బ్రెజిల్లో జికా వైరస్ విజృంభిస్తుండటంతో రియో ఒలంపిక్స్పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు తమ మహిళా క్రీడాకారిణిలను బ్రెజిల్ పంపడానికి సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఒలంపిక్స్ నాటికి జికాను అదుపులోకి తెస్తామని బ్రెజిల్ చెబుతోంది. భారత్‌లో డెంగీ వ్యాప్తి చేసే ఎడీస్ దోమలకు కొదువలేదు. ఈ దోమలే జికా వైరస్‌నూ వ్యాప్తి చెందిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
జైకాతో మరో ఐదుగురు శిశువులు మృతి
రియోడీ జనీరో : బ్రెజిల్లో జైకా వైరస్‌తో మరో ఐదుగురు శిశువులు మరణించారని ఆ దేశ ఆర్యోగమంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. మృతులంతా ఈశాన్య బ్రెజిల్ ప్రాంతం వారే అని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని వారే అత్యధికంగా ఈ వైరస్ బారిన పడుతున్నారని గుర్తు చేసింది. ఇప్పటి వరకు 3,893 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 224 కేసులు ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని పేర్కొంది. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పింది.