వాషింగ్టన్: జికా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే మొబైల్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్‌తో నియంత్రించగల, బ్యాటరీతో నడిచే డయాగ్నొస్టిక్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం విలువ కేవలం 100 డాలర్లు (సుమారు రూ.6,500) మాత్రమే. ఈ ఆవిష్కరణలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు.
‘పరికరాన్ని అపరేట్ చేయడంలో కొత్త యాప్ ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. సంప్రదాయ లేబొరేటరీ విశ్లేషణ పరికరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని అమెరికాలోని సాండియా నేషనల్ లేబొరేటరీస్‌కు చెందిన ఆశిశ్ ప్రియే తెలిపారు. ల్యాంప్ (లూప్– మీడియేటెడ్ ఐసోథర్మల్ ఆంప్లిఫికేషన్) డయాగ్నొస్టిక్ పద్ధతిపై ఆధారపడి ఈ పరికరం పనిచేస్తుంది.
30 నిమిషాల్లో ‘జికా’ను గుర్తించే యాప్
Published Wed, Mar 22 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
Advertisement