పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 12 మంది తీవ్రవాదులు హతమయ్యారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 12 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు కీలక కమాండర్లు సహా తీవ్రవాదులు కలిసి పాకిస్తాన్ భద్రతా దళంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో కోహ్లి జిల్లా నాసౌ ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. తీవ్రవాదుల నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా దళం వెల్లడించింది.
పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ద్వంద్వ పోరాటం చేయాలంటూ డిసెంబర్ 2014 లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకటన చేసింది. ఈ ప్రకటన అనంతరం పాకిస్తాన్‌లోని బాలోఛిస్తాన్‌లో భద్రతా దళాలు తీవ్రవాదుల దాడులపై చర్యలను తీవ్రతరం చేశాయి.