
ఐక్యరాజ్యసమితి : ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ ప్రతిష్ట మంటగలిసింది. ఐక్యరాజ‍్యసమితి తాజాగా వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో ఏకంగా 139 మంది పాక్ టెర్రరిస్టులకు చోటుదక్కింది. పాకిస్తాన్‌లో నివసిస్తూ ఆ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాదులను తాజా జాబితాలో చేర్చింది. అల్‌ఖైదా ప్రస్తుత నేత అల్ జవహరి ఈ జాబితాలో ముందువరుసలో నిలవగా, తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరేకు చెందిన హఫీజ్ సయీద్, ఆయన అనుచరులు అబ్దుల్ సలాం, జఫర్ ఇక్బాల్‌లున్నారు.
ఉగ్రకార్యకలాపాలకు ఊతమిస్తున్న పాక్‌కు చెందిన అల్ రషీద్ ట్రస్ట్, హర్కతుల్ ముజహదీన్, ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జేఈఎం, రబితా ట్రస్ట్, అల్ అక్తర్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, హర్కతుల్ జిహాద్ ఇస్లామి, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, జమతుల్ అహ్రర్ వంటి సంస్థలు యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే తమది ఉగ్రవాద బాధిత దేశమని తరచూ పాకిస్తాన్ నమ్మబలుకుతోంది.