20 ఏళ్లలో గ్రహాంతరవాసుల జాడ
భూమికి ఆవల జీవం ఉందా? ఈ ప్రశ్నకు మీరు జవాబు తెలుసుకోవాలంటే మరో 20 ఏళ్లు ఆగాలంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి కాకుండా కనీసం మరో ఆరు ప్రపంచాల్లో జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉందని, వాటిని కనుగొనేందుకు మహా అరుుతే మరో రెండు దశాబ్దాల సమయం మాత్రమే పట్టవచ్చునని చెబుతున్నారు. భూమికి ఆవల జీవానికి సంబంధించి శాస్త్రవేత్తలు మొత్తం మూడు పద్ధతుల్లో పరిశోధనలు కొనసాగిస్తున్నట్టు కాలిఫోర్నియూలోని ఓ సంస్థకు చెందిన సీనియర్ ఖగోళ శాస్త్రవేత్త సేథ్ షోస్టక్ తెలిపారు.
ఏమైనా ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలన్నీ అంగారకుడితో పాటు సౌరవ్యవస్థకు ఆవల జీవానికి అవకాశం ఉన్న చంద్రులపై మాత్రమే గ్రహాంతర వాసానికి సంబంధించిన అన్వేషణ కొనసాగిందని ‘డిస్కవరీ న్యూస్’ పేర్కొంది. అరుుతే మన సౌరవ్యవస్థలోనే జీవానికి అవకాశం ఉన్న కనీసం అర డజను ప్రపంచాలు ఉన్నాయని షోస్టక్ వివరించారు. వాటిని కనుగొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఒకవేళ అదే జరిగితే.. మరో 20 ఏళ్లలోగానే సాధ్యమయ్యే అవకాశం ఉందని వివరించారు.