2014 నోబెల్ విజేతలు
ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలోని సిటీహాల్లో ఈ రోజు నోబెల్ శాంతి బహుమతిని కైలాష్ సత్యార్థి, మలాలా అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం ఆరు విభాగాలలో 13 మందికి నోబెల్ బహుమతులు ప్రకటించారు.
శాంతి బహుమతి: 1. కైలాస్ సత్యార్థి (వయసు 60 - భారత్)
2. మలాలా యూసఫ్‌జాయ్ (17 - పాకిస్థాన్)
వైద్యశాస్త్రం: 1. జాన్ ఓ కీఫే (74, అమెరికన్ బ్రిటన్)
2. మే-బ్రిట్ మోజర్ (51, నార్వే)
3. ఎడ్వర్డ్ మోజర్ (52, నార్వే)
(వీరిద్దరూ భార్యాభర్తలు)
భౌతికశాస్త్రం: 1. ఇసామూ అకసకీ(85, జపాన్)
2. హిరోషి అమానో(54, జపాన్)
3. షుజీ నకామురా(60, జపాన్ అమెరికన్)
రసాయనశాస్త్రం: 1. ఎరిక్ బెట్జిగ్ (54, అమెరికా)
2. విలియం మోర్నర్ (61, అమెరికా)
3. స్టీఫెన్ హెల్ (51, జర్మనీ)
సాహిత్యం: 1. ప్యాట్రిక్ మోదియానో (69, ఫ్రాన్స్)
ఆర్థికశాస్త్రం: 1. జీన్ టిరోల్ (61, ఫ్రాన్స్)
నోబెల్ బహుమతి అందుకున్న ఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్థి. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు.
నోబెల్ పొందిన భారతీయులు:
రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913
సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930
హర్గోవింద్ ఖురానా-వైద్యం 1968
మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979
సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983
అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998
కైలాస్ సత్యార్థి- శాంతి 2014
భారత సంతతికి చెందిన వారు, భారత్లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు.
**