వాషింగ్టన్: పారిస్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అమెరికాలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ తాజా నివేదికలో వెల్లడించింది. సాన్బెర్నార్డినో కాల్పుల ఘటన కూడా ఇందుకు ఓ కారణమని నివేదిక అభిప్రాయపడింది.
పారిస్ ఘటన అనంతరం అమెరికాలో మత విద్వేషంతో ముస్లింలపై జరుగుతున్న దాడులు మూడు రెట్లు పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా దాడులు సరాసరిగా నెలకు 12 గా నమోదు కాగా, పారిస్ ఉగ్రదాడుల అనంతరం ఆ సంఖ్య 38 గా నమోదైనట్లు నివేదిక తెలిపింది. ఇటీవల రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్.. ముస్లింలను అమెరికాలోకి రాకుండా చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం అగ్రరాజ్యంలోని ముస్లింలను కలవరపెడుతోంది.
అగ్రరాజ్యంలో ముస్లింలపై పెరిగిన దాడులు!
Published Fri, Dec 18 2015 4:48 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement