మదర్ థెరిస్సాకు మరో అవార్డు | Another Tribute to Mother Teresa | Sakshi
Sakshi News home page

మదర్ థెరిస్సాకు మరో అవార్డు

Published Sun, Apr 10 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

Another Tribute to Mother Teresa

లండన్: సేవాశీలి మదర్ థెరిస్సాకు ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డు లభించింది. అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే విజయాలను సాధించిన ఆసియా వారికి ఈ అవార్డులను ఏటా అందజేస్తారు. మొత్తం 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చే స్తారు.  మదర్ థెరిస్సా భారత్‌లో చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేద ప్రజలకు, రోగులకు, అనాథలకు సేవ చేశారు. 1997లో కలకత్తాలో మరణించారు.

థెరిస్సాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకోవటానికి ఇటలీ నుంచి శుక్రవారం లండన్ చేరుకున్నారు. 2010 నుంచి పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ అవార్డులను అందజేస్తున్నారు. మదర్ థెరిస్సాను దైవ సమానురాలుగా గుర్తించిన ఈ ఏడాదే తాము ఆమెను ఈ అవార్డుతో గౌరవించడం సంతోషంగా ఉంద ని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement