ఐఫోన్6 తాకిడితో.. యాపిల్ వెబ్సైట్ క్రాష్
యాపిల్ కంపెనీ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. అర్ధరాత్రి నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ ఫోన్లకు ఆర్డర్లు ఇవ్వడానికి కస్టమర్లు సైట్ మీద వెల్లువెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. యాపిల్ స్టోర్ సైట్లోకి యూజర్లు అర్ధరాత్రి నుంచి లాగాన్ కావడం మొదలుపెట్టారు. రాత్రిపూట అయితే సర్వర్లు స్పీడుగా ఉంటాయని అప్పటినుంచి ఐఫోన్ల అమ్మకాలను ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఒకేసారి అందరూ వచ్చి పడటంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. కొన్ని సర్వీసులను మాత్రం దాదాపు అరగంట తర్వాత పునరుద్ధరించారు. కానీ మళ్లీ శనివారం ఉదయం యాపిల్ స్టోర్ చాలామందిక ఓపెన్ కాలేదు.
డెస్క్టాప్ సైట్లో ఐఫోన్ దొరకట్లేదని, అయితే కొన్ని క్యారియర్ వెబ్సైట్లు, యాపిల్ స్టోర్ యాప్లో మాత్రం దొరుకుతోందని కొంతమంది చెప్పారు. దీంతో చాలామంది వినియోగదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తెల్లవారుజాము వరకు తమ ఆర్డర్ ఇచ్చేందుకు వాళ్లు వేచి ఉన్నారు.
ఐఫోన్ 6 లాంచింగ్ సమయం నుంచే సమస్యలు మొదలయ్యాయి. లాంచింగ్ సమయంలో లైవ్స్ట్రీమ్ దాదాపు 25 నిమిషాల పాటు ఆగిపోయింది. దాంతో చాలామంది చైనా భాషలోనే కామెంట్రీ వినాల్సి వచ్చింది.