కాన్‌బెర్రా : ప్రమాదకర కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. అన్ని రంగాలపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. ఆయా రంగాల ప్రముఖులను సైతం వీడట్లేదు. తాజాగా ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అగ్రరాజ్యం అమెరికా పర్యటన నిమిత్తం ఐదు రోజుల కిందట అక్కడకు చేరుకున్నారు. వివిధ దేశాధినేతలతో ఆయన భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌తోనూ ఆయన సమావేశమయ్యారు. అయితే అమెరికా పర్యటన ముగించుని శుక్రవారం నాడు స్వదేశానికి చేరుకున్న మంత్రికి అక్కడి వైద్య అధికారులు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..)
కాగా బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అప్రమత్తమైయ్యాయి.. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేసుకుంటున్నాయి. భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో పలు కార్యక్రమాలను సైతం రద్దు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment