ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది | Australia's life expectancy climbs to record high: Report | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది

Published Thu, Nov 12 2015 10:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది

ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది

కాన్ బెర్రా: ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాల ప్రజలకన్నా ఎక్కువ జీవితకాలం రేటును ఇప్పటికే కలిగి ఉన్న ఆస్ట్రేలియన్ల ఆయుర్ధాయం మరింత పెరుగుతోందని తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో అక్కడి పురుషులు స్త్రీల సగటు జీవితకాలం మరింత పెరిగింది.

2013 లెక్కల ప్రకారం ఒక ఆస్ట్రేలియా పురుషుడి సగటు జీవితకాలం 80 సంవత్సరాల ఒక నెల ఉండగా తాజాగా అది 80 సంవత్సరాల మూడు నెలలకు పెరిగింది. ఇక మహిళల ఆయుష్షు మాత్రం 84 సంవత్సరాల నాలుగు నెలలకు పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో కేవలం ఆరు దేశాల్లో మాత్రమే స్త్రీ పురుషులు 80 ఏళ్ల సగటు జీవన ప్రమాణ రేటును కలిగి ఉన్నారు. అవి జపాన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఐస్ లాండ్, ఇజ్రాయెల్, స్వీడన్ దేశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement