
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే స్విడ్జర్లాండ్‌కు చెందిన మహిళల ఆయుర్దాయం ఎక్కువ. అక్కడి మహిళలు సగటున 79.03 సంవత్సరాలు బతుకుతారు. మగవారికన్నా వారే ఎక్కువ కాలం జీవిస్తారు. మగవాళ్లలో ఎక్కువ కాలం బతికేది సగటున ఆస్ట్రేలియన్లు. అక్కడ వారి ఆయుర్దాయం 74.1 సంవత్సరం. ఆస్ట్రేలియాలో మహిళలు కూడా ఎక్కువ కాలమే బతుకుతారు. అక్కడ వారి సగటు వయస్సు 78.9 ఏళ్లు. ఆస్ట్రేలియాలో కూడా మగవారికన్నా మగవారికన్నా ఆడవారే ఎక్కువకాలం బతుకుతారన్న మాట. అభివద్ధి చెందిన 15 దేశాల్లో మహిళలు, పురుషుల సగటు ఆయుర్దాయంపై పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
బ్రిటన్‌లో మహిళల ఆయుర్దాయం సగటున 76.43 ఏళ్లుకాగా, అమెరికాలో 76.08 ఏళ్లు. ఈ విషయంలో ఈ దేశాలు ఆరు, ఎనిమిదవ స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో మగవాళ్లు సగటున 72.33 ఏళ్లు, అమెరికాలో 71.57 ఏళ్లు జీవిస్తున్నారని తేలింది. స్త్రీ, పురుషులు ఎక్కువ కాలం జీవిస్తున్న యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని 15 దేశాల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. నార్వే, జపాన్, స్పెయిన్, డెన్మార్క్, బెల్జియం దేశాల జాబితా కూడా వీటిలో ఉంది. యూరప్‌లో స్వీడన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో మగవాళ్లు సగటున 74,2, 73.7 ఏళ్లు జీవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment