life expectancy
-
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్యానికి పెను ముప్పు.. ఆయుష్షులో ఐదేళ్లు ఫట్!
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం 2.2 ఏళ్లు తగ్గుతుందని తేల్చింది. ప్రపంచ దేశాల్లో వాయు కాలుష్యంపై అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐసీ) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ)ను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత మహా నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. గాలిలో అత్యంత కాలుష్య కారకాలైన సూక్ష్మ ధూళికణాలైన పీఎం–2.5 ప్రతి క్యూబిక్ మీటర్లో సగటున 107 మైక్రోగ్రాములకు మించి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఇది డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత ప్రమాణాల కంటే ఏకంగా 21 రెట్లు ఎక్కువ! ఢిల్లీలో వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ప్రజల సగటు ఆయుష్షు ఏకంగా పదేళ్లు తగ్గుతుందని వివరించింది. గాలిలో పీఎం–2.5 క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రో గ్రాములకు మించొద్దని డబ్ల్యూహెచ్ఓ గతేడాది స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంలో 44 శాతం వాటా భారత్‌దేనని తెలిపింది. ‘‘దేశంలో 40 శాతం అత్యంత కాలుష్యభరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాలుష్యం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతంలో 50 కోట్ల ప్రజల ఆయుర్దాయం 7.6 ఏళ్లు తగ్గుతుంది’’ అని చెప్పింది. చదవండి: ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ -
భారత్: 2 ఏళ్ల ఆయుష్షు తగ్గింది.. ఎందుకో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: కరోనా మానవ జీవితాలపై పెను ప్రభావం చూపించింది. భారీ సంఖ్యలో మరణాలతో పాటు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమయ్యింది. అంతేకాదు మానవుని సగటు జీవిత కాలాన్ని సైతం ఏకంగా రెండేళ్లు తగ్గించేసిందని తేలింది. దేశంలో దశాబ్ద కాలం కిందట ఉన్న సగటు ఆయుష్షు కాలానికి ఇది క్షీణించింది. కోవిడ్–19కు ముందు మరణాల తీరును, ఆ తర్వాత జరిగిన మరణాలపై ముంబైలోని అంతర్జాతీయ జనాభా అధ్యయన సంస్థ (ఐఐపీఎస్) ఆధ్యయనం చేసింది. కోవిడ్–19కు ముందు పురుషుడు సగటున 69.5 సంవత్సరాలు, మహిళ సగటున 72 సంవత్సరాల పాటు జీవిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్–19 తీవ్రత తర్వాత పురుషుడి సగటు జీవితకాలం 67.5 ఏళ్లకు, మహిళ సగటు జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు ఐఐపీఎస్ పరిశీలన వివరిస్తోంది. చదవండి: ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు నడివయస్కులపైనే అధిక ప్రభావం.. కోవిడ్–19తో ఆరోగ్య సంక్షోభాలు అధికంగా నమోదైనట్లు వివిధ రకాల పరిశీలనలు చెబుతున్నాయి. కోవిడ్–19కు గురైన వారిపైనే కాకుండా ఇతరులపైనా దీని ప్రభావం పడింది. సాధారణ చిక్సితలకు కూడా సకాలంలో సేవలు లభించని పరిస్థితులు, మందుల కొరత, కార్పొరేట్ దోపిడీ లాంటి కారణాలు ఇతర వర్గాలపై ప్రభావాన్ని చూపగా.. కరోనా వైరస్ సోకిన బాధితులకు తక్షణ వైద్యం అందకపోవడం, విషమించిన తర్వాత చికిత్సకు వెళ్లడం లాంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ప్రధానంగా నడివయస్కులపై ఇది ఎక్కువ ప్రభావం చూపింది. 35 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు వారి ఆయువు రెండేళ్లు తగ్గినట్లు ఐఐపీఎస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చదవండి: తెలంగాణలోనూ ఏవై.4.2 వేరియంట్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19కు ముందు, ఆ తర్వాత మరణాల రేటును ఐఐపీఎస్ విశ్లేషించింది. కోవిడ్–19 మరణాలే కాకుండా సాధారణ మరణాలకు సంబంధించిన గణాంకాలను సైతం పరిశీలనకు తీసుకున్న ఐఐపీఎస్.. వయసుల వారీగా మరణాల రేటును అంచనా వేసింది. మొత్తంగా 2010కి ముందు ఉన్న సగటు జీవితకాలానికి ప్రస్తుత సగటు ఆయుష్షు పతనమైనట్లు పరిశీలన వివరిస్తోంది. మానవ మరణాలకు 21 రకాల వైరస్ సంక్రమణలు కారణంగా ఉండగా... తాజాగా కోవిడ్–19ను సైతం ఆ జాబితాలో చేర్చడంతో సంక్రమణల సంఖ్య 22కు పెరిగింది. -
కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. కోవిడ్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఇతర రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. మనిషి ఆయుర్దాయంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సంక్షోభంతో మనుషుల సగటు ఆయుషు గణనీయంగా పడిపోయిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా తేల్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. -
మన ఆయుర్దాయం మరో పదేళ్లు!
న్యూఢిల్లీ: భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని చెప్పారు. ► 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది. ► కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది. ► భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి ► గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి. ► 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), ► పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఊబకాయంతో కరోనా తీవ్రం భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రజల ఆయుర్దాయాలు పెరిగాయని, అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని అ«ధ్యయనం సహరచయిత గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అలీ మొక్దాద్ చెప్పారు. ఊబకాయం, డయాబెటిస్ వంటి వాటితో కరోనా వైరస్ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. భారత్‌లో ఒకప్పుడు మాతా శిశు మరణాలు అత్యధికంగా ఉండేవని, అవిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. -
ఆ దేశ మహిళలకే ఆయుర్దాయం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే స్విడ్జర్లాండ్‌కు చెందిన మహిళల ఆయుర్దాయం ఎక్కువ. అక్కడి మహిళలు సగటున 79.03 సంవత్సరాలు బతుకుతారు. మగవారికన్నా వారే ఎక్కువ కాలం జీవిస్తారు. మగవాళ్లలో ఎక్కువ కాలం బతికేది సగటున ఆస్ట్రేలియన్లు. అక్కడ వారి ఆయుర్దాయం 74.1 సంవత్సరం. ఆస్ట్రేలియాలో మహిళలు కూడా ఎక్కువ కాలమే బతుకుతారు. అక్కడ వారి సగటు వయస్సు 78.9 ఏళ్లు. ఆస్ట్రేలియాలో కూడా మగవారికన్నా మగవారికన్నా ఆడవారే ఎక్కువకాలం బతుకుతారన్న మాట. అభివద్ధి చెందిన 15 దేశాల్లో మహిళలు, పురుషుల సగటు ఆయుర్దాయంపై పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్‌లో మహిళల ఆయుర్దాయం సగటున 76.43 ఏళ్లుకాగా, అమెరికాలో 76.08 ఏళ్లు. ఈ విషయంలో ఈ దేశాలు ఆరు, ఎనిమిదవ స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో మగవాళ్లు సగటున 72.33 ఏళ్లు, అమెరికాలో 71.57 ఏళ్లు జీవిస్తున్నారని తేలింది. స్త్రీ, పురుషులు ఎక్కువ కాలం జీవిస్తున్న యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని 15 దేశాల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. నార్వే, జపాన్, స్పెయిన్, డెన్మార్క్, బెల్జియం దేశాల జాబితా కూడా వీటిలో ఉంది. యూరప్‌లో స్వీడన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో మగవాళ్లు సగటున 74,2, 73.7 ఏళ్లు జీవిస్తున్నారు. -
ఢిల్లీవాసి ఆయుర్దాయం పదేళ్లు తగ్గింది!
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల్లో చూస్తే 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయిలకు దిగజారిందని, దాంతో ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని తాజాగా వెల్లడైంది. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. నివేదిక ప్రకారం.. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. నేపాల్ తర్వాత ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన దేశం భారత్ కావడం గమనార్హం. -
కాలుష్యంతో ఆయుఃప్రమాణంలో రెండేళ్లు కోత
లండన్ : వాయు కాలుష్యం మానవాళి ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా తగ్గిస్తోందని తాజా అథ్యయనం హెచ్చరించింది. కాలుష్యంతో ప్రపంచ జనాభా జీవనప్రమాణ కాలం రెండేళ్లు తగ్గుతోందని స్పష్టం చేసింది. కాలుష్యం కోరలు చాచడంతో అమెరికా, యూరప్‌ల్లో ప్రస్తుతం జన్మించే చిన్నారుల జీవనకాలం సగటున నాలుగు నెలలు తక్కువ కాగా, భారత్, ఈజిప్ట్ వంటి దేశాల్లో రెండేళ్ల వరకూ ఉంది. భారత రాజధాని న్యూఢిల్లీ, ఈజిప్ట్ రాజధాని కైరో ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గతంలో చేపట్టిన పరిశోధనలు వాయు కాలుష్యంతో ఎంతమంది మరణించారనే దానిపై దృష్టి సారించగా, జీవనకాలంపై అంచనా వేయడం ఈ పరిశోధన ప్రత్యేకమని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ బృందం వెల్లడించింది. పీఎం 2.5 నుంచి వాయుకాలుష్యంపై అథ్యయన బృందం పరిశోధనలు చేపట్టింది. వాయు కాలుష్యం కారణంగా విడుదలయ్యే ధూళి శరీర భాగాల్లోకి చేరడంతో ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతాయని, ఆస్త్మా వంటి వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది మృత్యువాతన పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనాలు వెల్లడిస్తున్నాయి. వాయుకాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్లను నివారించి జీవనకాలం పెంచవచ్చని పరిశోధకలు పేర్కొన్నారు. -
ద్వి శతమానం భవతి!
అక్షర తూణీరం మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత. మనిషి ఆయుర్దాయం 140 సంవత్సరాలకి పెంచగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిండు సభలో హామీ ఇచ్చారు. తథాస్తు! మనిషికి ఎన్నేళ్లు బతి కినా తనివి తీరదు. ఐశ్వర్యవంతులే కాదు దరిద్రులు కూడా సెంచరీ కొట్టాలని కోరుకుంటారు. ఇప్పటివరకూ ‘శతమానం భవతి’ అన్నది సర్వామోదం పొందిన దీవె నగా నిలబడింది. ఇకపై ఇలా అంటే ‘ఆయుష్మాన్ భవ’ అనే అర్థం స్ఫురిస్తుంది. ఇప్పుడన్ని జీవిత కొలమానాల్ని సరితూచి మళ్లీ నిర్ధారించాల్సి ఉంది. ఈమధ్య కాలంలో యనభై దాటడం అవ లీలగా మారిన సందర్భంలోనే బోలెడు తేడాలు, సమస్యలు తలెత్తుతున్నాయ్. ఒకప్పుడు అరవై, నిండగానే, హమ్మయ్య ఒక చక్రం తిరిగిందని దేవుడికి కృత జ్ఞతలు చెప్పుకునేవారు. యాభై దాటిందగ్గర్నించి ‘పెద్దాయన’గా అరవై దాటాక ‘ముసలాయన’ అనీ సంబోధించేవారు. ఇప్పడవి అమర్యాదలయినాయ్. ఇప్పుడు ఈ కొత్త భరోసా నేపథ్యంలో మన రాజ్యాంగాన్ని తిరగరాసుకోవలసి ఉంటుంది. భారతీయ శిక్షాస్మృతిని సవరించాలి. యావజ్జీవమంటేనే కనీసం యాభై ఏళ్లుగా నిర్ణయించాలి. జీవిత బీమా పరిమితిని నూటయాభైకి పెంచుకోవాలి. ఇప్పుడే ఉద్యోగ పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు గింగిరాలు తిరుగుతున్నాయ్. ముప్ఫై మూడేళ్లు ఉద్యోగం చేసి ముప్ఫై నాలుగేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న ఆయు రారోగ్యవంతులున్నా రు. అందుకే ఒక దశలో ‘గోల్డెన్ హాండ్ షేక్’ ఆశపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ గడుసు పిండాలు బంగారు కరచాల నానికి ససేమిరా అన్నారు. ఇప్పుడైతే రిటైర్మెంట్ వయసు వందకి పెంచేసి, ఇహ దణ్ణం పెట్టెయ్యడం మంచిది. రాజకీయాల్లో కటాఫ్ రెండు ఆవృతాలకు అంటే నూట ఇరవైకి పెట్టుకో వచ్చు. ఎముకలు కలిగిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడేమనేవారో తెలియదు. ఇదే సత్యమై నిత్యమై కార్యరూపం ధరిస్తే మొట్ట మొదట బాగుపడేది కార్పొరేట్ ఆస్పత్రులు. ఎందరో వయస్సు మళ్లిన జాంబవం తులు, భీష్మాచార్యులు దొరుకుతారు. ఎన్నో కొత్త రోగాలు పుట్టుకొస్తాయ్. అందరూ వైద్యబీమాకి అలవాటుపడతారు. ఇక దున్నుకోవడమే పని. ఈ జీవితం క్షణికం, బుద్బుదప్రాయం, మూన్నాళ్ల ముచ్చటే చిలకా లాంటి తత్వాలకు కాలం చెల్లినట్టే. మనిషికి ఇంకా ఆశ పెరుగుతుంది. దోచుకోవడం, దాచుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇకపై 140 ఏళ్ల సంసారికి ఆరో తరం వార సుణ్ణి చూసే అవకాశం వస్తుంది. పొందు కుదురులోనే నాలుగొందల పిలకలు లేచే అవకాశం ఉంది. ఎందు కొచ్చిందోగానీ ‘పాపి చిరాయువు’ అని నానుడి ఉంది. అధిక కాలం బతికితే అనర్థాలేనని అనుభవజ్ఞులు అంటారు. నిజమే, జీవితంలో ఏది శాపమో, ఏది వరమో తెలిసీ తెలియని అయోమయంలో బతికేస్తూ ఉంటాం. శాస్త్ర విజ్ఞానం పెరిగింది. దేనివల్ల మనిషి ఆయుర్దాయం పెరుగుతుందో తెలుసుకుంటే చాలు. ఎన్ని వందల ఏళ్లయినా బతికించగలరు. మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఆయుర్దాయం
న్యూఢిల్లీ: అత్యధిక ఆయుర్దాయం కలిగిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ నిలిచింది. 2010 వరకు ఈ జాబితాలో కేరళది అగ్రస్థానం. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) ఈ విషయాలను వెల్లడించింది. 2010 నుంచి 2014 వరకు పలు దఫాలుగా జరిపిన అధ్యయనాల తరువాత ఆర్జీఐ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) గతవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2010 వరకు అన్ని వయసు వర్గాల్లో కేరళలో ఆయుర్దాయం ఎక్కువ. ఇప్పుడు కేరళను తోసిరాజని జమ్మూ కశ్మీర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్ లాంటి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆయుర్దాయ సమాచారం వెల్లడికాలేదు. ఈ సర్వేలు కేవలం 21 పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ పుట్టిన సమయంలో సగటున 74.9 ఏళ్లతో కేరళ అత్యధిక ఆయుర్దాయాన్ని కలిగి ఉంది. ఈ విషయంలో 73.2 ఏళ్లతో ఢిల్లీది రెండో స్థానం. జమ్మూ కశ్మీర్ మూడో స్థానంలో ఉంది. ఏడాది నుంచి నాలుగేళ్ల చిన్నారుల్లో అతి తక్కువ మరణాలు (దేశం మొత్తం మరణాల్లో 0.1 శాతం) జమ్మూ కశ్మీర్లో నమోదవుతున్నాయి. -
మన జీవితకాలం ఐదేళ్లు పెరిగిందంట!
జెనీవా: గత 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు జీవిత కాలం ఐదేళ్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకటించింది. 1960 నుంచి సగటు జీవిత కాలం పెరుగుదలను పరిశీలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. 1990లో ఆఫ్రికాలో ఎయిడ్స్ వ్యాధి, తూర్పు ఐరోపాలో సోవియట్ కూటమి విడిపోవడం వంటి కారణాలరీత్యా సగటు జీవిత కాలం బాగా తగ్గిపోయింది. తాజాగా ఆఫ్రికాలో అత్యధికంగా ఇది 9.4 ఏళ్లు పెరిగి 60 సంవత్సరాలకు చేరింది. 2015లో జన్మించిన పిల్లలు సగటున 71.4 ఏళ్లు (బాలికలు 73.8 ఏళ్లు, బాలురు 69.1 ఏళ్లు) బతుకుతారని చెప్పారు. అయితే స్థానిక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చన్నారు. జపాన్ మహిళలు అత్యధికంగా 86.8 ఏళ్లు జీవిస్తారని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది. -
రెట్టింపు కానున్న వృద్ధుల జనాభా
పరిపరి శోధన ఆధునిక వైద్య పరిశోధనల పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుఃప్రమాణం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. మరో ముప్పయ్యేళ్లలో వృద్ధుల జనాభా రెట్టింపు కాగలదని అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 60 కోట్ల వరకు ఉంది. వృద్ధుల సంఖ్య ఏటా 8.5 శాతం మేరకు పెరుగుతూ వస్తోంది. అయితే, 2050 నాటికి వృద్ధుల జనాభా 160 కోట్లకు చేరుకోగలదని, వృద్ధుల జనాభా పెరుగుదల వేగం ఏడాదికి 17 శాతానికి చేరుకోగలదని అమెరికా సెన్సస్ బ్యూరో తన తాజా నివేదికలో ప్రకటించింది. -
ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది
కాన్ బెర్రా: ఆస్ట్రేలియన్ల ఆయుష్షు పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాల ప్రజలకన్నా ఎక్కువ జీవితకాలం రేటును ఇప్పటికే కలిగి ఉన్న ఆస్ట్రేలియన్ల ఆయుర్ధాయం మరింత పెరుగుతోందని తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన జాబితాలో అక్కడి పురుషులు స్త్రీల సగటు జీవితకాలం మరింత పెరిగింది. 2013 లెక్కల ప్రకారం ఒక ఆస్ట్రేలియా పురుషుడి సగటు జీవితకాలం 80 సంవత్సరాల ఒక నెల ఉండగా తాజాగా అది 80 సంవత్సరాల మూడు నెలలకు పెరిగింది. ఇక మహిళల ఆయుష్షు మాత్రం 84 సంవత్సరాల నాలుగు నెలలకు పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో కేవలం ఆరు దేశాల్లో మాత్రమే స్త్రీ పురుషులు 80 ఏళ్ల సగటు జీవన ప్రమాణ రేటును కలిగి ఉన్నారు. అవి జపాన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఐస్ లాండ్, ఇజ్రాయెల్, స్వీడన్ దేశాలు. -
మనిషి జీవితకాలం.. 500 ఏళ్లు!
మనిషి సగటు ఆయుష్షు మహా అయితే ఎంత ఉంటుంది? ప్రస్తుత ప్రమాణాల ప్రకారం అయితే 60-70 ఏళ్ల వరకు అనుకోవచ్చు కదూ.. కానీ వైద్య, వైజ్ఞానిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల భవిష్యత్తులో మనిషి 500 ఏళ్ల వరకు జీవించి ఉంటాడట!! ఈ విషయాన్ని గూగుల్ వెంచర్స్ సంస్థ అధ్యక్షులు బిల్ మారిస్ ‘బ్లూమ్‌బెర్గ్’ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, జన్యు పరిశోధన, క్యాన్సర్ పరిశోధన సంస్థలపై భారీ పెట్టుబడులు పెట్టిన గూగుల్ వెంచర్స్ సంస్థ మానవుల ప్రామాణిక జీవితకాలాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. బ్రిటన్‌లో ఈ పదేళ్ల కాలంలో మానవ ప్రామాణిక జీవితం కాలం ఐదింతలు పెరిగిందని, భవిష్యత్తులో ఇది 500 ఏళ్లకు పెరిగే అవకాశం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తాను మాత్రం వందేళ్లలోపు చనిపోవాలని కోరుకోవడం లేదని, కొన్ని వందలేళ్లు బతకాలని ఆశిస్తున్నానని తెలిపారు. గూగుల్ వెంచర్స్ 2009లో స్థాపించిన మారిస్, ఆ సంస్థ ప్రపంచ లావాదేవీలన్నింటినీ తానే స్వయంగా చూసుకుంటున్నారు. ఆయన సలహా మేరకే గూగుల్ సంస్థ యాపిల్ కొలాబరేషన్‌తో 2013లో కాలికో ప్రాజెక్టుకు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద వృద్ధాప్యంపై, ఆ కారణంగా వచ్చే వ్యాధులపై విస్తృత పరిశోధనలు చేస్తోంది. మిడిల్‌బరి కళాశాలలో న్యూరోలోజి దివిన మారిస్, డ్యూక్ విశ్వవిద్యాలయంలో న్యూరాలోజిపై విస్తృత పరిశోధనలు చేశారు. మారిస్ కొలీగ్, గూగుల్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ రే కుర్జెవీల్ మాత్రం మారిస్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. మానవ జీవన ప్రమాణకాలాన్ని 120 ఏళ్ల వరకు పెంచొచ్చని చెప్పారు. క్షీణించిన మానవ అవయవాల స్థానంలో త్రీడీ టెక్నాలజీని ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం ద్వారా ఇది సాధించవచ్చని ఆయన చెప్పారు. ఇది ఈ శతాబ్దంలోనే నెరవేరవచ్చని తెలిపారు. ఎలాంటి కృత్రిమ అవయవాల అవసరం లేకుండానే శాస్త్రవేత్తలు ‘సీ ఎలిగాన్’ అనే ఓ రకం క్రిమి జీవితకాలాన్ని లాబరేటరీలో ఐదింతలు పెంచడంలో ఇటీవల విజయం సాధించారు. ఆ క్రిమి జెనెటిక్ కోడ్ పూర్తిగా మ్యాపింగ్ చేయడం ద్వారా ఇది సాధ్యమైందని, మానవుడి జెనెటిక్ కోడ్‌ను కూడా పూర్తిగా మ్యాపింగ్ చేస్తే మానవ ప్రామాణిక జీవనకాలాన్ని నాలుగైదింతలు చేయవచ్చని ఏజింగ్‌పై పరిశోధనలు సాగిస్తున్న ‘బక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్’ శాస్త్రవేత్త డాక్టర్ పంకజ్ కపాహి తెలిపారు. -
వయసును పెంచితే.. డాలర్లు!
వాషింగ్టన్: మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పైగా పెంచగలిగే ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ప్రకటించారు. ‘మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలున్నాయన్నారు. -
నేపాళం ప్రశాంతతకు భూపాలం
యాత్ర కొలువుదీరిన హిమవత్పర్వతాలు... ఆకట్టుకునే ప్రకృతి సోయగాలు... అడుగడుగునా ప్రశాంత నిలయాలు...బుద్ధుని జన్మస్థలి అయిన నేపాల్ యాత్రానుభవాలు జీవితకాలం హృదయంలో పదిలపరచుకునే ఆనందామృతాలు...హాయిగా పాడుకునే భూపాల రాగాలు ‘విజయవాడ, విశాఖపట్నం, కాకినాడల్లో ఉన్న 30 మంది మిత్ర బృందంతో కలసి కొన్నాళ్లుగా అనుకుంటున్న నేపాల్‌కు రైలులో బయల్దేరాం.ఆ ప్రయాణ అనుభూతులు, పర్యావరణ అందాలు, ప్రశాంతత.. నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ మరపురానివే. ఆ రోజు ఉదయం 5 గంటలకు విజయవాడలో త్రివేండ్రం-గోరఖ్‌పూర్ రైలు ఎక్కి, సాయంత్రం 6 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకున్నాం. ముందుగా బుక్ చేసి ఉంచిన రూముల్లో కాసేపు సేద తీరి, గోరఖ్‌పూర్‌లో ప్రముఖ దేవాలయమైన గోరఖ్‌నాథ్ మందిరాన్ని సందర్శించుకున్నాం. అక్కడి ఆలయప్రాంగణంలోని ప్రశాంతత నూ అలుపు తీర్చేసింది. గోరఖ్‌పూర్ వాసులు రసాయన ఎరువులు లేకుండా పంటలు పండిస్తారని అక్కడివారు చెప్పారు. వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. ఆ రాత్రి అక్కడే బస చేసి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన లుంబినికి చేరాం. బుద్ధుడు పుట్టిన పుణ్యస్థలి... లుంబిని ప్రసవ సమయంలో రాణీ మాయాదేవి ప్రయాణిస్తుండగా రూపాందేహి జిల్లా ప్రాంతంలోని లుంబినిలో ఒక చెట్టు క్రింద సిద్ధార్థుడు జన్మించాడని కథనం. అతని తండ్రి చక్రవర్తి అవడం వల్ల అతని హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రముఖ బుద్ధ పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రాంతాన్ని తిలకిస్తే అడవిలో ఉన్నామనే అనుభూతితో పాటు మరెన్నో దేశాలను ఏకకాలంలో సందర్శించామనే ఆనందమూ కలుగుతుంది. మనదేశంతో పాటు చైనా, జపాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇతర దేశాల బుద్ధుని దేవాలయాలు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని పూర్తిగా అధ్యయనం చే స్తూ తిలకించాలంటే కొన్ని రోజులు పడుతుంది. పైపైన చూసేందుకు మాత్రం నడుస్తూ, రిక్షాలు, మినీ వ్యానులలో వెళ్లవచ్చు. ఇక్కడి మ్యూజియం బుద్ధునిపై పరిశోధనలు చేయడానికి చక్కగా దోహదపడుతుంది. విదేశీయులతో కళ కళ... ప్రపంచంలో ఏ దేశంలోనూ కనిపించనంత మంది విదేశీయు లు నేపాల్‌లో కనిపించారు. ఇందుకు ప్రపంచంలో అతి పెద్ద పర్వాతాల్లో 8 ఇక్కడే ఉండటం, బౌద్ధమత సంప్రదాయాలు, చల్లటి వాతావరణం ప్రధాన కారణాలుగా తెలుసుకున్నాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఇక్కడ నుంచే అధిరోహిస్తారు. ఎక్కలేని వారు హెలికాప్టర్ ద్వారా శిఖరపు అంచులను తిలకించి రావచ్చు. అత్యంత ఆనందం రోప్ వే... ఖాట్మండ్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గోర్ఖాజిల్లాలో మనోకామనా దేవాలయం ఉంది. ఈ ఆలయానికి కిందనుంచి పైకి వెళ్లడానికి రోప్ వేలో వెళుతుంటే అక్కడ ప్రవహిస్తున్న నదీ ప్రవాహంతో పాటు ప్రకృతి అందాలు సుందరంగా కనిపిస్తుంటాయి. పశుపతినాథుడు... ఖాట్మండ్ లోయలో భాగమతీ నదికి ఆనుకుని ఉన్న పశుపతినాథ్ దేవాలయంలోకి అడుగుపెట్టగానే నేపాలీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కనిపిస్తాయి. శక్తి పీఠాల్లో ఒకటైన గుజ్జేశ్వర అమ్మవారి దేవాలయం ఖాట్మండ్‌లోనే ఉంది. అమ్మవారి విగ్రహం ఉన్న చోట నీరు ఎంత పోసినా, తీసినా ఒకే కొలమానంలో ఉంటుంది. నేపాల్ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు భక్తాపూర్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ప్రజా దర్బారు, ప్రత్యేక కొలను ఇక్కడ కనిపించాయి. ప్రస్తుతం వాటిని మ్యూజియంలా ఏర్పాటు చేశారు. నేపాల్‌లో బెజవాడ భోజనం... మేం నేపాల్‌లో హోటల్ కల్పబ్రిక్షలో బస చేశాం. ఆ హోటల్ నిర్వాహకుడు హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్బజ్గల్ కావడంతో మాకు కలిసి వచ్చింది. ప్రయాణం మొత్తంలో తెలుగింటి వంటలను ఆస్వాదించాం. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. వారం రోజులు పాటు సాగిన మా ప్రయాణ అనుభూతులను నెమరువేసుకుంటూ విజయవాడకు చేరుకున్నాం.’ - వి.సత్యనారాయణ, విజయవాడ