‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’ | Banksy Wife Does Not Appreciate This Work From Home Art Piece | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : ‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’

Published Thu, Apr 16 2020 3:59 PM | Last Updated on Thu, Apr 16 2020 4:16 PM

Banksy Wife Does Not Appreciate This Work From Home Art Piece - Sakshi

లండన్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. 24 గంటలు ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక  నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది అయితే సెల్‌ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ టైంపాస్‌ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం తమలోని సృజనాత్మకతను బయటపెడుతున్నారు. రకరకాల వంటలు చేస్తూ కుటుంబ సభ్యులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇక నిత్యం పనితో బిజీబిజీగా గడిపేవారు మాత్రం లాక్‌డౌన్‌ వేళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో తోచగా తాము చేసే పనిని ఇంట్లోనే చేస్తూ కామెడీ పూలు పూయిస్తున్నారు. లాక్‌డౌన్‌తో రోజు పలు సమస్యలపై వ్యంగ్య ఆర్ట్స్‌ వేస్తూ ఆలోచింపజేసే బాన్‌స్కీ​(బ్రిటన్‌ వీధుల్లో స్ప్రే పెయింటింగ్‌ వేయడంలో బాన్‌స్కీ దిట్ట)  ఈ సారి కూడా ఓ వెరైటీ పెయింటింగ్‌తో ముందుకు వచ్చాడు.

 కానీ ఈ సారి వీధుల్లో పెయింటింగ్‌ వేయలేదు. తన ఇంట్లోనే ఈ పెయింటింగ్‌ వేశాడు‌. బాత్రూంలో ఎలుకలు చేసే పనిని తన పేయింటింగ్‌తో అద్భుతంగా చూపించారు. ఇక ఆయన వేసిన పేయింటింగ్‌లో ఓ ఎలుక పేస్ట్‌ను బయటకు వచ్చేలా తొక్కుతోంది. మరో ఎలుక టాయిలెట్‌ రోల్‌ను కిందకు లాగుతోంది. మరోకటి హ్యాండ్‌వాష్‌ను తన నోటితో కొరుకుతోంది. నిజమైన ఎలుకలు బాత్రూంలోకి వస్తే ఎలా ప్రవర్తిస్తాయో అలాగే ఉన్నాయి. ఇక ఈ పెయింటింగ్‌ ఫోటోను బాన్‌స్కీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ‘  నేను ఇంటి వద్ద నుంచి చేసిన పని(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) నా భార్యకు నచ్చడం లేదు’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం నాన్‌స్కీ పెయింటింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 1.5 మిలియన్ల లైకులు, 20 వేల కామెంట్లు వచ్చాయి. నాన్‌స్కీ పోస్ట్‌పై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. ‘మీ క్రియేటీవ్‌ పెయింటింగ్‌ చాలా బాగుంది. మీకు తెలుసా మీ బాత్రూం వెల కట్టలేనిది’, ‘ఎలుకలు చాలా ఉన్నాయి. పక్కింటి నుంచి పిల్లిని తీసుకురండి’, ‘మురికిగా బాత్రూంలంటే నాకిష్టం ఉండ‌దు. కానీ నేను ఇలాంటి బాత్రూంను ఎందుకు కావాల‌నుకుంటాను’, ‘క్వారంటైన్ లో 365వ రోజు’ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు.

. . My wife hates it when I work from home.

A post shared by Banksy (@banksy) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement