పారిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పారిస్ లో అడుగుపెట్టారు. నేటి నుంచి(సోమవారం) నుంచి ఇక్కడ ప్రారంభంకానున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేక అధ్యక్షుడి విమానంలో పారిస్ లోని ఓర్లీ విమానాశ్రయంలో ఆదివారం అర్థరాత్రికి ముందు చేరుకున్నారు.
పారిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పారిస్ లో అడుగుపెట్టారు. నేటి నుంచి(సోమవారం) నుంచి ఇక్కడ ప్రారంభంకానున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేక అధ్యక్షుడి విమానంలో పారిస్ లోని ఓర్లీ విమానాశ్రయంలో ఆదివారం అర్థరాత్రికి ముందు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది.
ఎప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమల విషయంలో పోటీ పెరిగి కర్బన మిశ్రమాల స్థాయి వాతావరణంలో పెరగడంతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలసిందే. దీనిని నిలువరించేందుకు అగ్ర రాజ్యాలన్నింటితోపాటు అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలను కూడా ఒప్పించి వాతావరణ రక్షన ఒప్పందంపై సంతకాలు చేయించాలనే దృఢ లక్ష్యంతో ఒబామా ఉన్నట్లు తెలిసింది. మొత్తం 150 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.