
భారత్‌కు బయల్దేరిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ వైమానికదళ స్థావరం నుంచి అధ్యక్షుడి విమానమైన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో భారత్‌కు బయల్దేరారు. ఆయన వెంట అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాతో ఉన్నతస్థాయి ప్రభుత్వ ప్రతినిధుల బృందం కూడా ప్రయాణిస్తోంది. ఒబామా విమానం మార్గంలో ఇంధనం నింపుకోవటం కోసం జర్మనీలోని రామ్‌స్టీన్‌లో కొద్దిసేపు ఆగుతుంది.
అక్కడి నుంచి బయల్దేరాక ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పాలం వైమానికదళ స్థావరంలో దిగుతుంది. ఒబామా మంత్రివర్గ సభ్యులు పలువురు, అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీ నేత (ప్రతిపక్ష నేత) నాన్సీ పెలోసీతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభావవంతమైన వాణిజ్యవేత్తలు ఢిల్లీలో ఒబామాతో జత కలుస్తారు.