రేప్‌ చేసిన వ్యక్తిని పెళ్లికి పిలిచింది! | Bride who invited her rapist to her own wedding | Sakshi
Sakshi News home page

రేప్‌ చేసిన వ్యక్తిని పెళ్లికి పిలిచింది!

Published Wed, Feb 3 2016 8:02 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

రేప్‌ చేసిన వ్యక్తిని పెళ్లికి పిలిచింది! - Sakshi

రేప్‌ చేసిన వ్యక్తిని పెళ్లికి పిలిచింది!

లండన్: అందమైన తన బాల్యాన్ని నరకప్రాయం చేసిన వ్యక్తి అతడు. పసిప్రాయంలోనే తనను లైంగికంగా కాటేసి.. బాల్యమంతా తనపై అత్యాచారం జరిపిన ఆ దుర్మార్గుడిని కూడా తన పెళ్లికి పిలిచింది ఆమె. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేముందు చివరిసారిగా అతని ముఖాన్ని చూసి.. మరోసారి అసహ్యించుకుంది. ఆ మహిళే క్రిస్టీ సటన్. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె తన బాల్యమంతా ఆ కిరాతకుడి చేతిలో ఎలా మొద్దుబారిపోయిందో ఓ టీవీ షోలో వెల్లడించింది. ఫ్యామిలీ ఫ్రెండ్‌ ముసుగులో జార్జ్‌ స్పూనర్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల వయస్సులోనే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత పరిస్థితులు ఆమెను ఎంతగా రాయిగా మార్చాయంటే.. అతన్ని కూడా తన పెళ్లికి పిలువక తప్పని పరిస్థితి కల్పించింది.

'అతని వల్ల, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను రాయిగా మారిపోయాను. నిజానికి నన్ను కుటుంబమే ద్వేషించేలా అతను వారిని ప్రభావితం చేశాడు' అంటూ క్రిస్టీ  కన్నీటిపర్యంతమవుతూ చెప్పింది. 'ఈ దారుణం గురించి ఎవరికైనా చెబితే నేను నా కుటుంబాన్ని దూరం కావాల్సి వస్తుందని అతను హెచ్చరించేవాడు. నిజానికి అతను చెప్పిందే నిజమైంది. నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు నా కుటుంబం దీనిని భరించలేకపోయింది. నా కుటుంబానికి నేను దూరమయ్యాను' అని ఆమె వివరించింది.  

23 ఏళ్ల వయస్సులో క్రిస్టీ తన స్నేహితుడు బ్యారీని పెళ్లాడింది. అయితే బాల్యంలో తనపై స్పూనర్ తరచూ అత్యాచారానికి పాల్పడే వాడని ఆమె తన భర్తకు చెప్పడంతో బ్యారీ మనస్సు ముక్కలైంది. వాళ్లిద్దరు కొంతకాలం వేర్వేరుగా గడిపారు. భార్య క్రిస్టీతో కలిసి టీవీ షోలో పాల్గొన్న బ్యారీ ఈ విషయాన్ని చెప్తూ.. స్పూనర్‌తో క్రిస్టీకి సంబంధం ఉందని మొదట అనుమానించానని, తాము ఇద్దరం కలిసి అతనికి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లినప్పుడు అతను చాలా అతిగా ప్రవర్తించాడని తెలిపాడు. తన భార్య చిన్నప్పుడు ఎదుర్కొన్న దారుణం గురించి తెలిసి తాను తట్టుకోలేకపోయానని, అందుకే ఆమెకు కొన్ని రోజులు దూరంగా ఉన్నానని బ్యారీ వివరించాడు.

బాల్యంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింసను బయటి ప్రపంచానికి వెల్లడించిన క్రిస్టీ ఎట్టకేలకు న్యాయాన్ని పొందింది. ఈ రహస్యాన్ని వెల్లడించినందుకు సొంత కుటుంబం, భర్త ఆమెను దూరం పెట్టినా.. చివరకు వాస్తవం వెలుగులోకి వచ్చింది. క్రిస్టీ ఇచ్చిన సాక్ష్యాధారాలతో ఏకీభవించిన బ్రిటన్ కోర్టు స్పూనర్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పిల్లలపై అత్యాచారం, దాడి వంటి అభియోగాల కింద అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికీ తమ పెళ్లిఫొటోలలో స్పూనర్‌ను చూస్తే తనకు దిగ్భ్రాంతి, అసహ్యం కలుగుతాయని టీవీషోలో కన్నీటిపర్యంతమవుతూ 28 ఏళ్ల క్రిస్టీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement