టార్చర్ చేసి.. ఆపై వీడియో తీస్తూ..! | British banker reveals shocking facts of his crime | Sakshi
Sakshi News home page

టార్చర్ చేసి.. ఆపై వీడియో తీస్తూ..!

Oct 27 2016 4:02 PM | Updated on Sep 2 2018 3:17 PM

టార్చర్ చేసి.. ఆపై వీడియో తీస్తూ..! - Sakshi

టార్చర్ చేసి.. ఆపై వీడియో తీస్తూ..!

ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చిన కేసులో బ్రిటన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ రురిక్ జట్టింగ్ పైశాచికత్వం బయటపడింది.

హాంకాంగ్:  ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చిన కేసులో బ్రిటన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ రురిక్ జట్టింగ్ పైశాచికత్వం బయటపడింది. తాజాగా ఇండోనేషియా మహిళ హత్య విషయంలో అతడు ప్రవర్తించిన తీరు వెల్లడి కావడంతో విచారణ జరపుతున్న జడ్జీలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అధికారుల కథనం ప్రకారం.. రురిక్ జట్టింగ్ ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. అనంతరం బ్యాంకింగ్, వ్యాపారరంగాల్లోకి ప్రవేశించాడు. ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ రురిక్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో సైకోగా మారిపోయి మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నాడు.

అతడిపై నమోదైన కేసుల విచారణలో భాగంగా రురిక్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నట్లు తెలిపాడు. సుమర్తి నింగ్సి అనే మహిళతో సహా ఇండోనేషియాకు చెందిన మరో మహిళ సెనెంగ్ మజియాషిని హత్య చేసినట్లు అంగీకరించాడు. నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులతో కూడిన జ్యూరీ బృందానికి పోలీసులు నిందితుడు రురిక్ తీసిన వీడియోను అందించారు. అది చూసిన న్యాయమూర్తుల బృందం షాక్ కు గురయ్యారు.

రెండేళ్ల కిందట తన అపార్ట్ మెంట్లో సుమర్తి నింగ్సి అనే మహిళను ఎంత దారణంగా వేధించి హత్యచేశాడో స్వయంగా వీడియో తీశాడు. నిందితుడు రురిక్ ఓ మహిళ మెడను తన వద్ద ఉన్న కత్తితో కోశాడు. అప్పటికే నగ్నంగా ఉన్న ఆమె ఆ సైకో వేదింపులు భరించలేక హత్యకు కొంత సమయం ముందు మూత్రవిసర్జన చేసినట్లు ఆ వీడియోలో ఉంది. నింగ్సిని తాను ఓ మహిళగా చూడలేదని, కేవలం శృంగార వస్తువుగా చూశానని తన ఆకృత్యాలను నిందితుడు రురిక్ కోర్టులో వెల్లడించాడు. ఇలాంటి దారుణాలకు పాల్పడే నిందితులను ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగనివ్వరాదని, కఠినచర్యలు తీసుకుంటామని హైకోర్టు డిప్యూటీ జడ్జి మైఖెల్ స్టూవర్ట్ మూర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement