లండన్: బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పటేల్ నియమితులయ్యారు. ప్రధాని డేవిడ్ కామెరూన్ కేబినెట్లో ప్రీతి ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ సారథ్యంలోని కన్సెర్వేటీవ్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామెరూన్ రెండో సారి ప్రధానిగా ప్రమాణం చేశారు. 43 ఏళ్ల ప్రీతి విథమ్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించింది. ఆమె తొలిసారి 2010లో బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికయిన ప్రీతి పలు పదవులు చేపట్టారు. బ్రిటన్, భారత్ మైత్రికి గట్టి మద్దతుదారు. వరుసగా రెండో సారి ఎంపీగా ఎన్నికై కేబినెట్ బెర్తు సంపాదించారు.
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
Published Mon, May 11 2015 6:45 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement