తమ దేశంలో మానవ హక్కుల రక్షణపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చైనా చర్యలు ప్రారంభించింది.
బీజింగ్: తమ దేశంలో మానవ హక్కుల రక్షణపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చైనా చర్యలు ప్రారంభించింది. మానవ హక్కుల రక్షణకు చట్టాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని, అలాగే జైళ్లలో పరిస్థితుల మెరుగునకు చర్యలు తీసుకుంటున్నామని సోమవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో కేంద్ర కేబినెట్ పేర్కొంది.
కేస్ ఫైలింగ్ రివ్యూ పద్ధతిని కేస్ ఫైలింగ్ రిజిస్టర్ పద్ధతికి మార్చడం ద్వారా సంస్కరణలకు తెరతీశామని, క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని సవరించామని ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అలాగే వ్యక్తుల హక్కుల పరిరక్షణలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ చట్టాన్ని బలోపేతం చేశామని, వీటితో పాటు మరిన్ని చట్టాల్లో మార్పులు తీసుకువచ్చామని చైనా తెలిపింది.