పొరపాటున తండ్రి మీద పడటంతో విషాదం..! | Chinese boy dies accidentally while playing with father | Sakshi
Sakshi News home page

పొరపాటున తండ్రి మీద పడటంతో విషాదం..!

Published Thu, Oct 13 2016 5:08 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

పొరపాటున తండ్రి మీద పడటంతో విషాదం..! - Sakshi

పొరపాటున తండ్రి మీద పడటంతో విషాదం..!

సరదాగా ఆడుతూ, గెంతులెస్తున్న చిన్నారి కొన్ని క్షణాల్లోనే మృత్యుఒడికి చేరాడు. కన్నతండ్రితో కలిసి సూపర్ మార్కెట్లో సందడి చేస్తున్న ఓ బాలుడు.. పొరపాటున తండ్రి మీద పడటంతో మృతిచెందాడు. ఈ విషాదం చైనాలోని గ్వాంగ్ ఝౌలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన విషయాలు సూపర్ మార్కెట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియా సైట్ యూట్యూబ్ లో ఎవరో ఈ వీడియోను అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. దాదాపు నాలుగేళ్ల వయసున్న ఓ బాలుడు తన తండ్రితో కలిసి సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ చిన్నారి తన తండ్రి చేతుల్లో చేతులు పెట్టి, వెనకాలే నడుస్తు కొంతసేపు మార్కెట్లో తిరిగాడు. అయితే అనుకోకుండా ఆ బాబు తండ్రి కింద పడిపోయాడు. దీంతో వెనకాలే ఉన్న చిన్నారిపై అమాంతం బరువు పడింది. ఆ పక్కనే ఉన్న మహిళా సేల్స్ ఉమన్ వారికి సహాయం చేస్తూ.. ఆ బాబు తండ్రి లేచి నిల్చునేందుకు తోడ్పడింది. ఆ తర్వాత బాబును లేపగా.. చిన్నారిలో చలనం లేదు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే యత్నంచేయగా, అప్పటికే ఆ చిన్నారి మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు. అమాంతం బరువు పడిపోవడంతో ఆ బాలుడికి సర్వికల్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చునని దీంతో బాలుడు చనిపోయే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement