ప్రపంచం మొత్తం సిరియా శరణార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్ అన్నారు
కెదార్ ర్యాపిడ్స్: ప్రపంచం మొత్తం సిరియా శరణార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రతి ఒక్కరం శరణార్థులకు సహాయం చేయాలని కోరుకోవాలని చెప్పారు.
సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలవైపు వస్తున్నవారికి రక్షణగా నిలవాలని సూచించారు. ఒక వేళ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఏ దేశానికి ఉంటుందో ఆ దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉండి సంపన్న దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు ఈ విషయంలో ముందుకు రావాలని సూచించారు.