
టెలిఫోన్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని షింజో అబే (ఫైల్ ఫోటో)
టోక్యో : జపాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశ రాజధానిలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని షింజో అబే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేపు(మంగళవారం) స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ జపనీస్ పత్రిక మొమియురి పేర్కొంది. ఈ సోమవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తారని తెలిపింది. బుధవారం రోజున కరోనాను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తెరపైకి తేనున్నట్లు న్యూస్ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పేర్కొంది. ( కరోనా: ఎక్కడ చూసినా శవాలే! )
కొద్దిరోజుల క్రితం టోక్యో గవర్నర్ యురికో కొయికే మాట్లాడుతూ.. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ కారణంగా దేశ ప్రజలు కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, జపాన్ ఇప్పటివరకు 3,500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. ( భారత్‌లో 4వేలు దాటిన కరోనా కేసులు )
Comments
Please login to add a commentAdd a comment