సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలకు భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్, సూర్య కిరణాలకు కొన్ని క్షణాల్లో నశించి పోతుందని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ సెక్యురిటీ’ ఓ అధ్యయనంలో కనుగొంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అడ్వైజర్ విలియం బ్య్రాన్ గురువారం రాత్రి వైట్‌హౌజ్ వద్ద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్ట్రావయొలెట్ లైట్‌తో రేడియేషన్ ప్రసరింప చేయడం వల్ల కరోనా వైరస్‌లో జన్యువులు నశించి పోయాయని పర్యవసానంగా అది పునరుత్పత్తి శక్తిని కోల్పోయిందని తెలిపారు.
(చదవండి: కరోనా: మనదేశంలో రికవరీ శాతం 20.57)
సూర్యుడి కిరణాల్లో కూడా ఈ అల్ట్రావయొలెట్ కిరణాలు ఉంటాయికనుక, వాటివల్ల కరోనా వైరస్ నశించి పోతుందని ఆయన చెప్పారు. ఉష్ణం, ఉక్క వల్ల కూడా వైరస్ నశిస్తుందని ఆయన అన్నారు. భూ ఉపరితలంపైనే కాకుండా గాలిలో ఉన్న వైరస్‌ను కూడా సూర్య కిరణాలు చంపేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు, శాస్త్రవిజ్ఞాన సంస్థలు నిర్ధారించాల్సి ఉంది.
(చదవండి: మహమ్మారిని తరిమే మార్గదర్శకాలు..)
Comments
Please login to add a commentAdd a comment