వాషింగ్టన్: మహమ్మారి కరోనా ఎక్కడ? ఎలా? పుట్టుకొచ్చిందో కనుగొనేందుకు చైనాకు నిపుణుల బృందం పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. ఈ విషయంపై చైనాతో చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. డ్రాగన్ దేశానికి వెళ్తేనే అక్కడేం జరగుతోందో తెలుస్తుందని అన్నారు. అయితే తమను చైనా సాదరంగా ఆహ్వానించట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. వ్యాపార, వాణిజ్య ఒప్పందాల పరంగా ఆ దేశంతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తాజా విపత్తుకు కారణమైన వైరస్‌తోనే పరిస్థితులన్నీ మారిపోయాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
(చదవండి: మసీదుల్లో రంజాన్ ప్రార్థనలకు పాక్ అనుమతి)
కోవిడ్-19పై చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన మరోమారు అసహనం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమకు సాయం చేసేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. చైనాలో తమ నిపుణల కమిటీ విచారణతో అసలు విషయాలు బయటికొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. కరోనా నియంత్రణలో తమ ప్రభుత్వం వేగంగా స్పందించిందనే ట్రంప్ వ్యాఖ్యలపట్ల ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాలు ట్రంప్ ప్రభుత్వ పనితీరును చెబుతున్నాయని చురకలు వేస్తున్నాయి. కాగా, కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా లక్షా 65 వేల మరణాలు సంభవించగా.. ఒక్క అమెరికాలోనే 41,000 మంది ప్రాణాలు విడిచారు.
(చదవండి: ఏప్రిల్ 23న బ్లాక్‌డేనా?)
Comments
Please login to add a commentAdd a comment