
సియాటెల్: గూగుల్ క్యాంపస్‌లో నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సియోటల్‌లో గూగుల్ నిర్మిస్తున్న నూతన క్యాంపస్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో బిల్డింగ్‌పై నుంచి క్రేన్ భాగాలు రద్దీగా ఉండే రోడ్డుపై పడిపోయాయి. దీంతో దాదాపు ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో కార్లలోని ఇద్దరు వ్యక్తులతోపాటు, ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే క్రేన్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.