![దాదాపు ప్రాణాలుపోయినంత పనైంది](/styles/webp/s3/article_images/2017/09/5/71494769565_625x300.jpg.webp?itok=k7eh7_wI)
దాదాపు ప్రాణాలుపోయినంత పనైంది
లండన్: తొందరపాటుతో పనులు వేగంగా అయ్యే అవకాశాలకంటే నష్టం జరిగే ఛాన్సే ఎక్కువ. ఆ నష్టం ఏ విధంగానైనా ఉండొచ్చు. ముఖ్యంగా తత్తరపాటుతో ప్రాణాలుపోయే సందర్భాలు, పరువు పోయే సంఘటనలు చాలా ఎక్కువ. లండన్‌లో ఓ వ్యక్తి తొందరపాటు దాదాపు అతడి ప్రాణాలు తీసినంత పనైంది. రెప్పపాటులో అతడు ప్రాణాలతో భయటపడ్డాడు. ఓ పక్క రైలు వస్తుందని గేటు వేసిన దానిని పక్కకు జరిపి మరీ ఓ వ్యక్తి సైకిల్‌తో పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు.
సరిగ్గా పట్టాలపైకి అడుగుపెడుతుండగా రైలు రయ్‌మంటూ దూసుకెళ్లింది. అప్పటికైనా అతడు తన ప్రాణాలు మిగిలాయని సంతృప్తి చెందకుండా మరింత కోపంతో ఆ రైలు వైపు తన చేతులు విసురుతూ ఇష్టమొచ్చిన మాటలు అన్నాడు. రాళ్లు విసిరేసినంత పనిచేశాడు. సరిగ్గా అతడు రైలు దాటే చోటు నుంచి కొద్ది మీటర్లు ముందుకెళితే ఓ బ్రిడ్జి ఉన్నప్పటికీ క్రాసింగ్ నుంచే వెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా చేశాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.