కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన వీరిని ఓ పోలీసు అధికారి హత్య కేసు, ప్రజలపై దాడుల కేసుల్లో దోషులుగా నిర్ధారించి శిక్ష వేసింది. ఆధునిక ఈజిప్టు చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.