
గాజాపై భీకర దాడులు
గాజా/జెరూసలెం: హమాస్ ప్రాబల్యం ఉన్న గాజాలో పలు ప్రాంతాలపై మంగళవారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. గాజాలోని అనేక మసీదులు, ఆసుపత్రి, స్టేడియంపై కూడా ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దాడుల్లో పలు మసీదులు, ఆసుపత్రి, స్టేడియం ధ్వంసమయ్యాయి. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు, గాజా ప్రాంతంలోని 190 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకూ 604 మంది పాలస్తీనియన్లు, 29మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఇరుపక్షాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సంస్థల యత్నాలు ఫలించటం లేదు. హింసాకాండకు స్వస్తిచెప్పాలంటూ అమెరికా, ఐక్యరాజ్యసమితి ఉభయపక్షాలకు విజ్ఞప్తిచేశాయి.